Home

»

Tv News

Brahmamudi : పోలీస్ స్టేషన్ లోనే మదన్, స్వాతిల పెళ్లి.. సిరిని ఇల్లు ఖాళీ చేయమన్న కాలనీవాసులు!

Sep 18, 2026 9:42AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 1139 లో....మదన్, స్వాతిలు బ్రోతల్ కేసులో పోలీసులకు దొరికిపోగా రేఖ, భ్రమరం, శేషు, భూషణ్ తో పాటు రాజు, ఇందు కూడా స్టేషన్ కి వెళ్తారు. ఎస్సై .. మీ ఫ్యామిలీకి ఫోన్ చేయండి.. మీరు గొప్ప ఫ్యామిలీ అన్నారు కదా అని అడిగితే మేము ఏ తప్పు చేయలేదు..‌త్వరలో పెళ్లి చేసుకుందామని ఇంట్లోంచి వచ్చేశాం.. అద్దె ఇల్లు తీసుకొని సెటిల్ అవుదామనుకున్నమని మదన్ చెప్తాడు. అప్పుడే రేఖ, భ్రమరం వచ్చి ఐడీ కార్డులు చూపించి.. వీళ్లు మా పిల్లలు అని చెప్తారు. వాళ్లకు మాకు ఏ సంబంధం లేదు, వాళ్లు ఎవరో నాకు తెలీదు, వాళ్ల సంతకం మీద బయటకు రానని మదన్ తెగేసి చెప్తాడు. దీంతో భ్రమరం.. ఇంగ్లీషులో మాట్లాడితే ఇస్తరాకులా మడతపెట్టేస్తానంటూ ఫైర్ అవుతుంది.

 

అదే టైంలో రాజు ఎంట్రీ ఇచ్చి.. మదన్ మనం మగవాళ్లం ఎలా అయినా ఉండొచ్చు, ఆడవాళ్లు అలా కాదు.. నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలని నచ్చజెప్పి ఒక సొల్యూషన్ ఇస్తాడు. మీ మీద పడిన నింద పోవాలంటే మీరు పోలీస్ స్టేషన్ నుంచి భార్యాభర్తలుగా బయటకు రావాలని రాజు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. పోలీస్ స్టేషన్ లో పెళ్లి ఏంటి? నా కొడుకు పెళ్లి ఘనంగా చేద్దామనుకున్నా..‌ ఇక్కడ తూతూ మంత్రంగా చేస్తారా అని రేఖ, భ్రమరం అడ్డుకున్నా మదన్.. మీకు అడ్డుపడే హక్కు లేదు.. మేము మేజర్లం.. మీతో బంధాన్నే తెంచుకున్నాం.. ఇక్కడే పెళ్లి చేసుకుంటామని చెప్పి స్వాతితో కలిసి పెళ్లికి రెడీ అవుతాడు. ఇందు తాళి తీసుకురాగా ఎస్సై.. బాబు తాళి కట్టు అని అనడంతో భ్రమరం‌‌‌‌.. నీ పై అధికారులకు చెప్తానని బెదిరిస్తుంది. మీ మీదే కేసు ఫైల్ చేస్తానని  పోలీస్ వార్నింగ్ ఇస్తాడు.

 

మరోవైపు సిరి ట్రాక్ లో పెద్ద గొడవే జరిగింది. పిల్లలు ఆడుకుంటుంటే చలపతి .. వెళ్తే కాళ్లు విరగ్గొడతానని బెదిరించినా సిరి తప్పించుకొని వెళ్లి ఓ పాప దగ్గర బంతి లాక్కొని తోసేస్తుంది. దీంతో ఆ పాప తల చెట్టుకు కొట్టుకొని గాయమవుతుంది. దీంతో కాలనీవాసులంతా చలపతి ఇంటి మీదకు వచ్చి.. ఈ అమ్మాయికి వెర్రి ఉందా? తాటిచెట్టులా పెరిగి చిన్న పిల్లలతో ఆటలేంటి? ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేయండి.. లేదంటే మీరే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి అంటూ ఫైర్ అవుతారు. నా పరువు తీసేస్తున్నారంటూ సిరిని తిట్టి వెళ్లిపోతాడు చలపతి. దీంతో రాజు, ఇందు సిరిని తీసుకొని తమ ఇంటికి తీసుకెళ్లగా.. నా కొడుకును ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేసి నీ మొదటి భార్యను ఇంటికి తీసుకొస్తున్నావా.. తను ఇక్కడ ఉండటానికి వీల్లేదంటూ ఫైర్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Brahmamudi, Brahmamudi Episode 1139, Star Maa Serial, Madan, Swathi, Reka, Bhramarambha, Raju, Indu, Siri]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com