
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu. ఈ బుధవారం నాటి ఎపిసోడ్ 581 లో..... ప్రేమ, ధీరజ్ లను శాశ్వతంగా విడగొట్టడానికి భద్రావతి, సేనాపతిలు ప్లాన్ చేస్తుంటే నర్మద, విశ్వ, అమూల్యలు వాళ్లని కలపాలని ట్రై చేస్తున్నారు. ఇంటి ముందు సేనాపతి.. ప్రేమను ధీరజ్ తో కలవనివ్వకూడదంటే భద్రావతి.. ఈగో వ్యసనం లాంటిది, ధీరజ్ కి ఈగో ఎక్కువ, దాన్ని టార్గెట్ చేస్తే చాలు అని రాక్షసంగా నవ్వుతూ బలమైన ప్లాన్ వేస్తుంది.
మరోవైపు కొత్త పెళ్లికొడుకు తిరుపతి శోభనానికి రెడీ అయి డ్యాన్స్ చేస్తుంటే సుకన్య.. అందరి సమక్షంలోనే జరగాలి, మన పెళ్లికి అందరూ ఒప్పుకోలేదని ఏడుస్తున్నట్లు నటించి తుస్సుమనిపిస్తుంది. నా మీద ప్రేముంటే వెయిట్ చెయ్, మీ వాళ్లను ఒప్పించమని చెప్పి వెళ్లిపోతుంది. బయట భాగ్యం, ఆనందరావు వెయిట్ చేస్తుండగా సుక్కు వచ్చి..మీరు చెప్పినట్టే చేశానని చెప్తుంది. వల్లి భాగ్యంకి సీక్రెట్ గా ఫోన్ చేసి..తుఫాను తర్వాత ప్రశాంతతలా ఉందంటుంది. చింతామణి పొట్టుగా కొట్టిందని ఆనందరావు చెప్తాడు. తిరుపతిని బంగారు బాతు అనుకున్నప్పుడు భరించాలి, ఆ ఇంట్లోకి లెగ్గు పెట్టేలా చేస్తాను, మీరు భద్రావతి కంటపడకుండా కేరింగ్ గా ఉండండి అని వల్లి ఫోన్ కట్ చేస్తుంది. కానీ గదిలోకి వెళ్లి బెడ్ పై వేదవతిని చూసి షాక్ అవుతుంది.
రావే రా అంటూ వేదవతి పిలుస్తుంది. నాకు సంబంధం లేదు, నేను అమాయకురాలిని, నన్ను నిర్దోషిగా విడుదల చేయండి అంటూ వల్లి నటిస్తుంది. సుకన్యను ఈ ఇంటికి తెచ్చిందే నువ్వు కదా అని వేదవతి అనడంతో వల్లి.. పాత తప్పుల కింద వదిలేయండి అని బతిమాలుతుంది. ఇక్కడే పడుకుంటాను, లైట్ ఆఫ్ చేయ్ అని వేదవతి చెప్తుంది. ఇక లైట్ ఆఫ్ చేయగానే వల్లిని పొట్టు పొట్టుగా వాయించేసి భద్రకాళీగా మారి తెల్లవారేవరకు నిద్రలేకుండా చేస్తుంది వేదవతి. తెల్లవారగానే నర్మద స్నేహితురాలు స్మిత.. వల్లి గురించి ఫుల్ ఎంక్వైరీ చేసి ప్రూఫ్స్ రెడీగా పెట్టానని చెప్పడంతో నర్మద వెళ్లబోతుంటే సాగర్ తో రొమాన్స్, తర్వాత వల్లి.. పొద్దున్నే రొమాన్సా అంటుంది. కాదు యాక్షన్ అని తాడుతో పని ఉందని చెప్పి వెళ్తుంది. ధీరజ్ కారుపై DEEMA అని రాసి ప్రేమను చూడగానే MA చెరిపేయడంతో.. నా పేరును చెరిపేస్తున్నావాఅని ప్రేమ తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






