TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Karthika Deepam2: కృష్ణమూర్తి చావుకు సుమిత్రే కారణం.. నిజాలు బయటపెట్టిన మాలిని!

Aug 30, 2026 11:21AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -764 లో ....గత రెండు రోజులుగా కార్తీకదీపం సీరియల్ ఊహించని ట్విస్ట్ లతో దూసుకుపోతోంది. జ్యోత్స్న పెళ్లి మరోసారి పీటలపైనే ఆగిపోగా.. పెళ్లి కొడుకు ఎవరో కాదు తన కన్నకొడుకు అంటూ మాలిని ఇచ్చిన షాక్ తో శివన్నారాయణ, దశరథ్, కార్తీక్, దీప ఫ్యామిలీ ఉలిక్కిపడింది. నా భర్తను చంపిన మిమ్మల్ని వదిలిపెట్టనంటూ మాలిని చేసిన హెచ్చరికలకు కొనసాగింపుగా ఈరోజు ఎపిసోడ్ లో అసలు పగకు మూలం ఎక్కడ మొదలైందో ఫ్లాష్ బ్యాక్ ద్వారా బయటపెట్టింది.

మాలిని చెప్పిన ఫ్లాష్ బ్యాక్ లో పగ తన భర్త చావుతో కాదు.. సుమిత్ర, దశరథ్ ల పెళ్లితోనే మొదలైందని తేలింది. సుమిత్ర ఇష్టపడి దశరథ్ ను పెళ్లి చేసుకుని ఇంటికి రావడంతో దక్షిణామూర్తి ఆగ్రహంతో తాళి తెంపబోతే శివన్నారాయణ అడ్డుకుని దక్షిణామూర్తిని కొట్టడంతో రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం మొదలైంది. స్నేహాన్ని అడ్డం పెట్టుకుని ఎదిగిపోవాలని చూస్తున్నారంటూ మాలిని భర్త కృష్ణమూర్తి దశరథ్ కుటుంబాన్ని అవమానించగా శివన్నారాయణ మాత్రం సుమిత్ర ఇక తన కోడలేనని తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత జరిగిన లారీ యాక్సిడెంట్ తో కథ మరింత మలుపు తిరిగింది. దశరథ్ ను లారీ గుద్దబోతుంటే అడ్డుగా వెళ్లిన కాంచనకు యాక్సిడెంట్ అయ్యి నడుము విరిగి చక్రాల కుర్చీకే పరిమితం అయింది. ఈ యాక్సిడెంట్ వెనుక కృష్ణమూర్తి హస్తం ఉందని అనుమానించిన సుమిత్ర పోలీసులతో మాలిని ఇంటికి వెళ్లి నిలదీస్తుంది. కడుపుతో ఉన్నానని తన బిడ్డపై ఒట్టేసి చెబుతున్నానని మాలిని ఎంత ప్రాధేయపడినా సుమిత్ర కేసు వెనక్కి తీసుకోకపోవడంతో అవమానం భరించలేక కృష్ణమూర్తి గదిలోనే షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు.

తన భర్త చావుకు సుమిత్రే కారణమని కాంచనపై ప్రేమతో సొంత అన్నపైనే పగ తీర్చుకుందని మాలిని ఏడుస్తుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ సాక్షిగా శివన్నారాయణ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసిన మాలిని.. ఇన్నేళ్ల తర్వాత తన కొడుకు ద్వారా ఆ ప్రతీకారాన్ని తీర్చుకుందని చెప్తుంది. దీంతో జ్యోత్స్న పెళ్లి ఆగిపోవడం వెనుక ఉన్నది ప్రేమ కాదు.. తన తల్లికి జరిగిన అన్యాయానికి కొడుకు తీర్చుకున్న ప్రతీకారమని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Karthika Deepam serial, Karthika Deepam today episode August 29, Karthika Deepam 2 Telugu serial, Jyotsna marriage stopped, Malini flashback story, Sumitra Dasharath love marriage, Kanchan accident reason, Krishnamurthy suicide reason]

google-ad-img