స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -565 లో....ప్రేమ, ధీరజ్ ని కలపాలని నర్మద వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. ప్రేమ గదిపైకి రాయి విసిరి దాన్ని ధీరజ్ పైకి తోసింది నర్మద. దీంతో ఇద్దరూ రాళ్లు పట్టుకుని కొట్టుకోడానికి రెడీ అయ్యారు. వెంటనే నర్మద వచ్చి.. ఎన్నాళ్లు ఈ హింస, ఎన్నాళ్లు ఈ రక్తపాతం అంటూ డైలాగులు కొట్టి ఆపింది. మీలో ఇంకా ప్రేమ ఉంది కలిసిపోండి అని చెప్పినా ఇద్దరూ వినకుండా వెళ్లిపోవడంతో శత్రువులను కలపడం ఈజీ కానీ ప్రేమ ఉన్న మొగుడు పెళ్లాలను కలపడం కష్టమని నర్మద అనుకుంటుంది.
తిరుపతి బర్త్ డే కోసం భాగ్యం ఇంటికి వెళ్లగా సుక్కూ, భాగ్యం, ఇడ్లీ చిన్న కేక్, నాలుగు బెలూన్లతో డెకరేషన్ చేశారు. దానికి తిరుపతి బిస్కెట్ ప్యాకెట్ పెట్టాల్సిందని కోప్పడతాడు. మేము పేదోళ్లం, ఇదే చివరి బర్త్ డే, సుక్కూకి తమిళ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది, చెన్నై వెళ్తున్నామని వాళ్ళు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు. ప్రతి యుగంలో ప్రేమకు పరీక్షలు తప్పవు, నీ కోసం ప్రపంచంతో యుద్ధం చేస్తానని తిరుపతి శపథం చేసి తమ వాళ్లను ఒప్పిస్తానని ఒకే ఒక్క ఛాన్స్ తీసుకుంటాడు.
మరోవైపు కోచింగ్ సెంటర్ దగ్గర ప్రేమ ధీరజ్ కు కాల్ చేస్తే ధీరజ్ కట్ చేస్తూ అవాయిడ్ చేస్తాడు. దీంతో ప్రేమ ముగ్ధ ఫోన్ లాక్కుని వాయిస్ మార్చి ధీరజ్ కి కాల్ చేస్తుంది. ధీరజ్ ముందే గుర్తించి కావాలనే.. చెప్పు ముగ్ధ, ఈవినింగ్ లాంగ్ డ్రైవ్ వెళ్దామా" అని అంటూ ప్రేమని ఏడిపిస్తాడు. ఇప్పటివరకు మాట్లాడింది నేనే, నా నంబర్ నుంచి కట్ చేసి దాని నంబర్ కి ఫస్ట్ రింగ్ కే ఎత్తుతావా, మీ అంతు చూస్తా అని ప్రేమ ఫైర్ అయి ఫోన్ కట్ చేసింది. ఇక మరోవైపు భాగ్యం తన ప్లాన్ ప్రకారం తిరుపతి మెడలోని 6 లక్షల గోల్డ్ చైన్ ను సుక్కూ మెడలో వేయిస్తుంది. ఆ వెంటనే వల్లి వంటగదిలో వేదవతి ముందు సుక్కూకి కాల్ చేసి.. తిరుపతి బాబాయ్ 6 లక్షల చైన్ గిఫ్ట్ ఇచ్చాడా అని స్పీకర్ లో పెద్దగా మాట్లాడుతుంది. వీడియో కాల్ లో చైన్ చూసిన వేదవతి షాక్ అయి సుక్కూపై కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Illu Illalu Pillalu Today Episode, Illu Illalu Pillalu August 29 Episode, Illu Illalu Pillalu Serial Update, Star Maa Serial, Tirupati Sukku Love Track, Prema Dheeraj Fight, Valli Conspiracy]




