స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ - 1130 లో ఏం జరిగిందంటే...నందు, వెంకీ ఇద్దరిని కేక్ తీసుకురావడానికి బయటకు పంపిస్తుంది నందు. ఏంటమ్మా ఇందు వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడుతుంటే నువ్వు ఏకంగా వాళ్ళని బయటికి పంపిస్తున్నావని లక్ష్మి అడుగుతుంది. మీరే అన్నారు కదా వాళ్ళు సరిగా ఉండడం లేదని అందుకే ఇలా పంపించాను. ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారని ఇందు చెప్తుంది. చలపతి అంకుల్ అనుకుంటున్నట్లు ఈ కుటుంబంతో కలిసి ఉంటే ఏమైనా అవుతుందనే ఆలోచన పోగొట్టాలని ఇందు అంటుంది.
మరోవైపు సిరి స్పృహలోకి వచ్చిందా అని డాక్టర్ ని రాజు అడుగుతాడు. కళ్ళు తెరిచింది అంతే అని డాక్టర్ సిరి దగ్గరకు తీసుకెళ్లి స్పృహలోకి వచ్చిందో లేదో రాజ్ కి చూపిస్తాడు. ఆ తర్వాత రాజ్ ని ఫాలో అవుతూ వచ్చిన రౌడీ రేఖకి ఫోన్ చేసి ఈ రాజ్ హాస్పిటల్ కి వచ్చాడని చెప్తాడు. దీంతో రేఖ కూడా హాస్పిటల్ కి బయల్దేరుతుంది. మరోవైపు నందు, వెంకీ కేక్ తీసుకొని రిటర్న్ అవుతారు. ఏమైనా చెప్పాలా వెంకీ" అని నందు అడుగుతుంది.. ఏం లేదని వెంకీ చెప్తాడు. ఆ తర్వాత రేఖ హాస్పిటల్ కి వచ్చి డాక్టర్ తో రాజ్ మాట్లాడడం చూస్తుంది.
అప్పుడే నర్సు బయటకు వస్తుంది. అతను ఎవరు అని రేఖ అడుగుతుంది. అక్కడ ఉన్న పేషెంట్ భర్త, తన భార్య కోమాలో ఉందని నర్సు చెప్తుంది. అతని భార్య కాదని రేఖ అంటుంటే లేదండి కావాలంటే రిపోర్ట్ లో భర్త దగ్గర తన సంతకం ఉందని చూపిస్తుంది. దీంతో రాజ్ సంతకం పెట్టింది రేఖ ఫోటో తీసుకుంటుంది.నన్ను ఎలా ఇరికించావో నిన్ను అలాగే ఇరికిస్తానని రేఖ అనుకుంటుంది. మరోవైపు నందు, వెంకీ ఇద్దరు రాజ్ బర్త్ డే కి ఏర్పాట్లు చేస్తారు.
తరువాయి భాగంలో రేఖ అందరి ముందు సిరి గురించి చెప్తుంది. ఆ సిరి గురించి నాక్కూడా తెలుసని ఇందు అనగానే రేఖ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Brahmamudi Today Episode, Brahmamudi Episode 1130, Star Maa Brahmamudi Serial, Brahmamudi Serial Today]




