Home

»

Tv News

Podharillu : లక్కీ కోసం విక్కీని ప్రేమిస్తానన్న మహా.. రగిలిపోతున్న చక్రి!

Aug 25, 2026 9:42AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 188లో...బృందావనంలో ఇప్పుడు లక్కీనే సెంటర్ అయిపోయాడు. కన్నా నుంచి మాధవ్ వరకు అందరు లక్కీని ఎత్తుకుని మురిసిపోతున్నారు. విక్కీ అయితే లక్కీని సొంత కొడుకులా చూసుకుంటున్నాడు. వాడికి ఏం కావాలో, ఎలా ఉంటే హ్యాపీగా ఉంటాడో అని తెగ కేర్ తీసుకుంటున్నాడు. విక్కీకి లక్కీ మీద ఉన్న ప్రేమను చూసి మహాలక్ష్మీ మనసులో కూడా విక్కీ అంటే ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతోంది. 

 

అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. మహాలక్ష్మీ అందరి ముందు సడెన్‌గా ఒక బాంబ్ పేల్చింది. లక్కీ సంతోషం కోసం, వాడి భవిష్యత్తు కోసం నా మనసుని కూడా మార్చుకోవడానికి నేను రెడీ. అవసరమైతే లక్కీ కోసం నేను విక్కీని ఏమో ప్రేమిస్తానేమోనని చెప్పేసింది. డైరెక్ట్‌గా ప్రేమిస్తానని కాదు, "ప్రేమిస్తానేమో" అని డౌట్‌గా అంది. కానీ ఆ ఒక్క మాటతో బృందావనం మొత్తం షాక్ అయిపోయింది. ఇక ఈ మాట విన్నాక చక్రి పరిస్థితి చెప్పక్కర్లేదు. ఆల్రెడీ విక్కీ, లక్కీల బాండింగ్ చూసి లోలోపల కుళ్ళుకుంటున్న చక్రికి ఇప్పుడు మహా కూడా విక్కీ వైపు మాట్లాడటంతో కడుపు మంట డబుల్ అయింది.

 

నేను మహా కోసం ఎంత ట్రై చేస్తున్నా, తన మనసులో నా మీద ప్రేమ పుట్టించాలని పార్కులకు తీసుకెళ్తున్నా, తను మాత్రం నన్ను కాదు విక్కీని గురించి ఆలోచిస్తోందని కుమిలిపోతూ కోపంతో రగిలిపోతాడు. ఇప్పుడు సీరియల్ మొత్తం చక్రి - మహా - విక్కీ ట్రయాంగిల్‌లోకి వెళ్ళిపోయింది. మహా ప్రేమను దక్కించుకోవడానికి చక్రి ఇంకా గట్టిగా శపథం చేస్తాడు. విక్కీ మాత్రం లక్కీని అడ్డం పెట్టుకుని మహాకి దగ్గరవ్వాలని చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com