.webp)
సూరజ్ పరిచయం.. జ్యోత్స్నతో గొడవ.. కార్తీక్ వాళ్ళ నాన్న శ్రీధర్ ని కాపాడిన సూరజ్.. అసలేం జరుగుతుంది ఈ కార్తీక దీపం సీరియల్ లో.. కథని రోజు రోజుకి కొత్త ట్విస్ట్ లతో కొత్త క్యారెక్టర్స్ తో ఎంగేజ్ చేస్తున్నారు మేకర్స్. అసలేం జరుగుతుందో ఓ సారి చూసేద్దాం.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం-2 . ఈ సీరియల్ ఇప్పటికే ఆరొందల ఎపిసోడ్ లు పూర్తిచేసుకుంది. మొదటి సీజన్ నాలుగు సంవత్సరాల కాలం నడిపించిన దర్శకుడు రెండో సీజన్ కూడా అంతే నడిపించేట్టుగా ఉన్నాడు. ఎందుకంటే కథని ట్విస్ట్ లతో సాగిస్తునే ఉన్నాడు. సుమిత్ర కూతురు దీపే అనే నిజం తెలిసినప్పటి నుండి ఈ సీరియల్ టీఆర్పీ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్ లలో జ్యోత్స్న నెల రోజుల్లో పెళ్ళి చేసుకోకపోతే ఆస్తులన్నీ మేనల్లుడి కి చెందుతాయని దశరథ్ వీలునామా రాస్తాడు. దానికి సుమిత్ర, శివన్నారాయణ ఒప్పోకవడంతో జ్యోత్స్నకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక దీపే సుమిత్ర కూతురు అనే నిజం తెలుసుకున్న జ్యోత్స్న తనని ఎలాగైనా అంతం చేసి ఆస్తిని దక్కించుకోవాలని చూస్తుంది.
మరోవైపు శ్రీధర్ కి హార్ట్ ఎటాక్ రావడంతో సూరజ్ అతడిని హాస్పిటల్ లో జాయిన్ చేసి కార్తీక్ ని రమ్మంటాడు. అతని మంచితనం చూసి కార్తీక్ ఇంప్రెస్ అవుతాడు. ఇక సూరజ్, జ్యోత్స్నల మధ్య ఒక షాపింగ్ మాల్ లో గొడవ జరుగుతుంది. దాంతో ఇద్దరు ఒకరిమీద ఒకరు రివేంజ్ ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో సూరజ్ చేసే పని నచ్చి అతనికి ఓ అవకాశం ఇవ్వాలని కార్తీక్ భావిస్తాడు. మరోవైపు శ్రీధర్ మేనేజర్ భాద్యతల నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలోకి ఎవరు వస్తారనే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలో నెలకొంది. మరి సూరజ్ ని కార్తీక్ ఆ స్థానంలో కూర్చునేలా చేస్తాడా లేదా కామెంట్ చేయండి.




.webp)
