స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ రోజు రోజుకి ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ఎందుకంటే కథని దర్శకుడు అలా తీర్చిదిద్దారు. మొదట్లో మహా, చక్రిల పరిచయం పెళ్ళి చూసి రెగ్యులర్ స్టోరీనే కదా కొత్తగా ఏం ఉందని ఆడియన్స్ అనుకున్నారు.. కానీ కథ ముందుకు సాగే కొద్దీ మలుపులు, ట్విస్ట్ లతో సీరియల్ పై ఆసక్తిని పెంచేశాడు దర్శకుడు.
డ్రైవర్ చక్రిని మహా పెళ్ళి చేసుకోవడం ఆమె తండ్రి ప్రతాప్ కి ఇష్టం లేదు.. కానీ తనకి నచ్చని సంబంధం తెచ్చాడని మహా అనుకోని పరిస్థితుల్లో చక్రిని వివాహం చేసుకుంది. దాంతో చక్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా చక్రిని మహా ఎప్పుడు భర్త అని చూడలేదు. ఇక చక్రి వాళ్ళ ఇంట్లో మాధవ అలియాస్ పెద్ది, కేశవ, కన్నా, నారాయణ ఉంటారు. వారందంరితో మహా చక్కగా మాట్లాడుతుంది కానీ చక్రితో అంత క్లోజ్ గా ఉండలేకపోతుంది. ఇదిలా ఉండగా తాయారు తన కూతురు గాయత్రీ, నారాయణ కొడుకు మాధవ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు ఇక పెళ్ళి చేసుకుందామనేసరికి తాయారు వచ్చి మాధవని రిక్వెస్ట్ చేసి పెళ్ళి జరకుండా చూస్తుంది. ఆ తర్వాత గాయత్రీకి వేరే సంబంధం చూసి పెళ్ళి చేసి పంపించేస్తుంది తాయారు. ఇక గాయత్రీని మరచిపోలేక మాధవ డల్ గా ఒంటరిగా ఫీల్ అవుతాడు.
మాధవని మాములు చేయడానికి సరదగా రెసాట్ కి వెళ్దామని మహా ప్లాన్ చేస్తుంది. అయితే అదే సమయంలో ప్రతాప్ కి రెస్ట్ ఇవ్వాలని లలిత భావిస్తుంది. ఇక లలిత, ఆది, హారిక, సిరి, ప్రతాప్ అందరు కలిసి రెసాట్ కి వస్తారు. అటు ప్రతాప్ ఫ్యామిలీ , ఇటు నారాయణ ఫ్యామిలీతో మహా వస్తుంది. ఆయితే రెసాట్ కి వచ్చాక ప్రతాప్, నారాయణ కలిసి డ్రింక్ చేస్తుంటారు. ఇద్దరు కలిసి డ్రింక్ చేసిన ఫోటోని మహాకి పంపించమని ప్రతాప్ తో నారాయణ చెప్తాడు. ఆ ఫోటోని మహా చూసి చక్రి, కేశవ, కన్నా, మాధవలకి చూపిస్తుంది. వాళ్ళు షాక్ అవుతారు. ఇక అప్పుడే నారాయణ, ప్రతాప్ ల దగ్గరికి ఆది వస్తాడు. వీడే నన్ను పొడిచింది అని నారాయణ అనగానే నువ్వు ఆ డ్రైవర్ గాడి నాన్నవా అని ప్రతాప్ తక్కువ చేసి మాట్లాడతాడు. ఇక ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆది వాళ్ళ ఫ్రెండ్ దే ఆ రెసాట్ కాబట్టి ఆది ఏం చెప్తే అది వింటాడు అతను. ఇక నారాయణ ఫ్యామిలీకి, ప్రతాప్ ఫ్యామిలీకి మధ్య మధ్య గొడవ జరుగుతుంది. దాంతో ఒక రేస్ పెడతారు. అందులో ఎవరు నెగ్గితే వాళ్ళు రెసాట్ లో ఉండాలని అంటారు. ఈ రేస్ ఇద్దరి పరువుకి సంబందించిన విషయం.. మరి ఇద్దరిలో ఎవరు నెగ్గుతారు.. ఎవరు రెసాట్ లో ఉంటారో తెలియాలంటే సోమవారం నాటి ఎపిసోడ్ చూడాల్సిందే.




