.webp)
బిగ్ ట్విస్ట్.. బిగ్ షాక్.. అది ఎవరూ ఊహించి ఉండరు.. ఏంట్రా ఇది అనుకునే లోపే వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకున్నారు.. అదే రాజు-కావ్య ఇద్దరు పెళ్ళి చేసుకున్నారు. ఎవరు వీళ్లు అంటే బ్రహ్మముడి సీరియల్ లోని నటీనటులు. ఎస్.. ఇది రేఖకి పెద్ద షాక్.. బ్రహ్మముడి సీరియల్ లో ఇదే బిగ్గెస్ట్ ట్విస్ట్.. బ్రహ్మముడి సీరియల్ మొదలై అప్పుడే మూడు సంవత్సరాలు అయింది. అది వెయ్యికి పైగా ఎపిసోడ్ లతో దుమ్మురేపుతుంది. సీరియల్ మొదట్లో కావ్య-రాజ్, స్వప్న-రాహుల్, అప్పు-కళ్యాణ్ లతో దుగ్గిరాల కుటుంబం కళకళలాడేది. ఎప్పుడు అయితే రుద్రాణి తన పంతం నెరవేర్చుకోవాలని అనుకుందో అప్పటి నుండి కథ అతిపెద్ద మలుపు తీసుకుంది.
బాంబ్ బ్లాస్ట్ చేసి మొత్తం ఫ్యామిలీని లేపేద్దామని అనుకుంటే చిన్న పిల్లలు తప్పించుకుంటారు. వాళ్ళే ఇందు, నందు, స్వాతి అవుతారు. ఇక రాజ్ మేనల్లుడు రాజుగా కొత్త తరం వస్తుంది. ఇక రాజు పెద్దవాడు అవ్వడం.. బస్తీలో పెరగడం.. రాజ్-కావ్యల కూతురు ఇందుగా రేఖ కింద పనిచేస్తుంటుంది. ఇక ఇందుకి పద్దెనిమిదేళ్ళు అయ్యాక ఆస్తి మొత్తం సొంతమవుతుందని రేఖ భావించి ఇందు బర్త్ డేని పెద్దగా ప్లాన్ చేస్తుంది కానీ ఇందుని రాజు కిడ్నాప్ చేస్తాడు. కొన్నిరోజుల తన దగ్గర ఉంచి, డబ్బులు డిమాండ్ చేస్తాడు రాజు. డబ్బులు ఇచ్చాక ఇందుని రేఖకి అప్పగిస్తాడు. అయితే ఆ తర్వాత ఇందుచేత ఆస్తి పేపర్ల మీద వేలిముద్ర వేయించుకొని లాయర్ దగ్గరికి వెళ్తే అది చెల్లదని లాయర్ చెప్తాడు. దాంతో రేఖ షాక్ అవుతుంది. ఇందుకి పెళ్లి జరిగితేనే ఆస్తి తన సొంతం అవుతుందని రాజ్-కావ్య చనిపోక ముందు వీలునామా రాస్తారు. అది తెలుసుకున్న రేఖ..ఇందుని తనకి తెలిసిన వాడికి ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకుంటుంది కానీ రేఖకి మరో షాక్ తగులుతుంది.
రాజు, ఇందు పెళ్లి చేసుకొని వస్తారు. రేఖ షాక్ అవుతుంది. మొన్న ఇందుని కిడ్నాప్ చేసి ఇరవై లక్షలు తీసుకుంది కూడా నేనే అని రాజు చెప్పగానే అందరు షాక్ అవుతారు. అప్పుడు నా దగ్గర వారం రోజులు ఉంచుకున్నాను కదా.. అప్పుడే తను అంటే లవ్ ఏర్పడింది.. నాకు డబ్బు అవసరం ఉందని మీతో పంపాను కానీ నా మనసు తన దగ్గరే ఉందని రాజు అంటాడు. నువ్వు ఇష్టపడ్డావ్ ఒకే కానీ మా ఇందుకి ఇష్టం లేదు కదా అని శేషు అంటాడు. తప్పు జరిగింది కాబట్టి తను ఏం చేస్తుందని రాజు అంటాడు. మా ఇందు తప్పు చేసిందంటే నేను ఒప్పుకోను అని శేషు అంటాడు. అదొక పౌర్ణమి రోజు ఇందుకి భోజనం తీసుకొని వచ్చాను. అప్పుడే ఆకాశంలో మెరుపులు ఇందు భయపడి నన్ను హగ్ చేసుకుంది. ఇక అప్పుడే తప్పు జరిగిందని రాజు చెప్తాడు.
మీ పెళ్లి ఒక బొమ్మలాట తాళి తీసేయ్ అని ఇందు మెడలో తాళిని రేఖ తీయబోతుంటే అప్పుడే రాజు తనని ఆపుతాడు. ఇప్పుడు తను నా భార్య.. ఇప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఈ వీడియోస్ మీడియా వాళ్ళకి చూపించి జరిగింది చెప్తానని రేఖని రాజు బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇందుని తీసుకొని రాజు మళ్ళీ గుమ్మం దగ్గరికి వచ్చి ఇప్పుడు లోపలికి రమ్మంటారా.. మీడియా దగ్గరికి వెళ్ళమంటారా అని రాజు అంటాడు. ఇక చేసేదేమీ లేక లోపలికి రండి అని రేఖ చెప్పేసి కోపంగా లోపలికి వెళ్తుంది. భ్రమరాంబ వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత నువ్వు అచ్చం మా అబ్బాయిలాగే ఉన్నావని అపర్ణ అంటుంది. మనిషిని పోలిన మనుషులు ఉంటారని రాజు అంటాడు. తరువాయి భాగంలో ఇందుని విడాకులు తీసుకోమని రేఖ చెప్తుంది. మీలో ఎంతమంది ఈ సీరియల్ చూస్తున్నారు.. ఇందు విడాకులు ఇస్తుందా.. రాజు ఏం చేయనున్నాడో కామెంట్ చేయండి.




.webp)

