Karthika Deepam 2: నిజం చెప్పేసిన పారిజాతం.. జ్యోత్స్నపై సుమిత్ర ఫైర్!
Nov 29, 2026 9:10AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-842 లో... జ్యోత్స్న రెండు కోట్లు తీసుకుందని, అందులో 25 లక్షలు వాడి సూరజ్ కోసం రక్తం కొనిందని, మిగతా డబ్బు అంతా అకౌంట్ లో ఉన్నాయని కార్తీక్ అందరికీ చెప్తాడు. ఈ విషయం తనకి, దీపకి తెలుసునని.. చెప్పే సందర్భం రాలేదు కాబట్టి చెప్పలేదని కార్తీక్ అంటాడు. దీంతో దక్షిణామూర్తి శివన్నారాయణపై ఫైర్ అవుతూ.. నీ తల తీసుకుంటావా, నీలాగే నీ మనవరాలిది డబ్బు మనసురా, తల దించుకుని పోరా తల ఎత్తుకుని తిరిగే అర్హత నీకు లేదంటూ అవమానిస్తాడు. శివన్నారాయణ తలదించుకుని వెళ్లిపోతాడు.
కార్తీక్ మాట్లాడిన తీరు దీపకి నచ్చదు. ఇలా మాట్లాడింది నా భర్తేనా, పారిజాతం గారు డబ్బు తీసుకుంటే ఆవిడతో నిజం చెప్పిద్దామనుకుంటే పారిజాతం చేసిన పనే నువ్వు చేశావంటూ కార్తీక్ ని దీప నిలదీస్తుంది. కార్తీక్ మాత్రం మనసులో "నేను మాట్లాడిన మాటలు, తీరు దీపకి జ్యోత్స్నకి మింగుడు పడదు, కానీ నేను కావాలనే ఇలా మాట్లాడాను, నేను అనుకున్నది జరిగిందనుకుంటాడు. ఆట ఇప్పుడే మొదలైందని కార్తీక్ అంటాడు.
జ్యోత్స్న జీవితంతో అందరూ ఆడుకున్నట్లు ఉందని దీప బాధపడితే, జ్యోత్స్న కూడా మట్టిలోని బంగారం లాంటిదే, ఇలాంటి గాయాలు అయితేనే తన విలువ పెరుగుతుందని కార్తీక్ అంటాడు.
మరోవైపు మాలిని మనసులో.. ఈ కథ ఇక్కడి వరకు తెచ్చింది నేనే, సుమిత్ర, జ్యోత్స్నలను ఇంటికి తీసుకురావడం నా లక్ష్యం కాదు, వాళ్లని కుమిలికుమిలి చచ్చేలా చేయడమే నా లక్ష్యం అని అనుకుంటుంది.
అసలు సూత్రధారి ఎవరనే చర్చ మొదలవుతుంది. ఆ రాయబారి ఎవరని కార్తీక్ ని శివన్నారాయణ అడుగుతాడు. మన వాళ్లే, మన ఇంట్లో వాళ్లే అని కార్తీక్ అంటాడు. వెంటనే పారిజాతం భయంతో ముందే ఒప్పుకుంటుంది. శివన్నారాయణ కోపంతో పారిజాతం పీక నొక్కడానికి వెళ్తే.. నాకేం పాపం తెలీదు, జ్యోత్స్న చెప్పింది నేను చేశానంటూ మొత్తం జ్యోత్స్న మీదకి నెట్టేస్తుంది. విన్నావా జ్యోత్స్న ఇదే యదార్థమని కార్తీక్ అంటాడు. దీంతో జ్యోత్స్న చాలా ఏడుస్తుంది. ఇంత దిగజార్చుతావా నన్ను, నీ మనసునే ఖరీదు కట్టిస్తావా అమ్మా అంటూ శివన్నారాయణ కన్నీరు పెడతాడు.
ఆ తర్వాత జ్యోత్స్నని సుమిత్ర కొట్టి.. సూరజ్ దగ్గర పీఏగా చేరి వాడిని వలలో వేసుకుని వాళ్ల అమ్మతో బేరం పెడతావా, నువ్వు మనిషివేనా, నా కడుపులో కూతురిగా ఎలా పుట్టావే, తల్లిగా నేను ఓడిపోయాను, రెండు కోట్లకి మనసుని అమ్మేసింది అంటే నేను వినేది నా కూతురి గురించేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జ్యోత్స్నని వదిలేయండి తను ఇంక భరించలేదని దీప అంటున్నా వినకుండా.. నాకు ఇలాంటి దరిద్రపు కూతురు వద్దు, ఎవరి బిడ్డనో ఇన్నాళ్లు పెంచాను అనుకుంటా, ఇలాంటి కూతురు నాకు వద్దు పోవే అని ఇంటి నుంచి గెంటేస్తుంది సుమిత్ర. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




