Brahmamudi: ఐశ్వర్య బెడ్ రూమ్ లో రఘువీర్.. లక్కీని అవమానించిన భార్య!
Nov 29, 2026 9:02AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1201 లో .. రఘువీర్ ఇంటికి వస్తున్నాడని ఐశ్వర్య ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేయడంతో పాటు అతడి ముందు ఫ్యామిలీ ఎలా ప్రవర్తించాలి.. ఎలా మాట్లాడాలనే విషయాలపై సూచనలిస్తుంది. రఘువీర్ కోట్లకు అధిపతి అని, ఎన్నో కంపెనీలు అతడి ఆధీనంలో ఉన్నాయని గొప్పగా చెప్తూ అతడిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే రాజు, ఇందులకు ఇప్పటికే రఘువీర్ గురించి తెలుసు కాబట్టి ఐశ్వర్య మాటలను అంతగా పట్టించుకోరు. రాజు మాత్రం తనదైన శైలిలో వెటకారంగా స్పందిస్తూ ఐశ్వర్య మాటలను పట్టించుకోకుండా ఉంటాడు.
ఈ సమయంలో లక్కీ తన భార్య ఐశ్వర్య డ్రెస్సింగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. రఘువీర్ వస్తున్నప్పుడు కాస్త పద్ధతిగా చీర కట్టుకోవచ్చుగా అని సూచిస్తాడు. అపర్ణ కూడా ఇదే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఐశ్వర్య మాత్రం వాళ్ల మాటలను అస్సలు పట్టించుకోదు. తను చిన్నపిల్లను కాదని, ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తనకు తెలుసని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.ఇప్పుడు డ్రెస్సింగ్ విషయంలో ఆంక్షలు పెడుతున్నారని.. రేపు తన తిండి విషయంలో కూడా నిబంధనలు పెడతారా అంటూ నిలదీస్తుంది.
ఇంతలో రఘువీర్ రాయల్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. అతడిని చూసిన ఐశ్వర్య ఎంతో ఆతృతగా వెళ్లి స్వాగతం పలుకుతుంది. కోట్లకు అధిపతి, ఎన్నో కంపెనీలకు యజమాని అనే విషయం తెలుసుకున్న భ్రమరాంబ, రేఖ కూడా అతడిని కలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇంట్లోకి వచ్చిన రఘువీర్ ను ఐశ్వర్య అందరికి పరిచయం చేస్తుంది. ఐశ్వర్య తన భర్త లక్కీని పట్టించుకోకుండా రఘువీర్ చుట్టూ తిరుగుతుండటంతో లక్కీ మనసులో బాధపడతాడు.
ఇక ఐశ్వర్య రఘువీర్ ను తన ఇల్లు అంటూ గొప్పగా చెప్పుకుని, తన బెడ్ రూంలోకి తీసుకెళ్తుంది. తన బెడ్ రూమ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, తన మనసులోని భావాలను చెప్పుకునే ప్రదేశమని చెప్తుంది. రఘువీర్ ఆమెను ఇంప్రెస్ చేయడానికి బెడ్ రూమ్ చాలా బాగుందని పొగడ్తలతో ముంచెత్తుతాడు. వీరిద్దరూ బెడ్ రూమ్ లో ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి లక్కీ వాటర్ తీసుకొచ్చినట్లు అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. అప్పటికే రఘువీర్ ఐశ్వర్యను పొగుడుతూ ఉండటంతో లక్కీకి కోపం వస్తుంది. లక్కీ తన భార్యను పిలవగా, ఆమె మాత్రం డోర్ మూసుకుని రావాలి కదా అంటూ లక్కీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనికి లక్కీ కూడా ఘాటుగా స్పందిస్తూ, బెడ్ రూమ్ లోకి వేరే మగాడిని తీసుకురావడం కూడా మ్యానర్స్ కాదని అంటాడు.
అయితే రఘువీర్ కేవలం ప్రతీకారం కోసం మాత్రమే కాకుండా ఇంకా ఏదో పెద్ద కుట్ర చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అపర్ణ భావిస్తుంది. రఘువీర్ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టాడని, తమ కుటుంబాన్ని ఏదో విధంగా ఇబ్బందుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ఇందును హెచ్చరిస్తుంది. ఇలా రాజు, ఇందు రఘువీర్ కుట్రలను బయటపెట్టేందుకు సవాల్ చేయడం, ఐశ్వర్య అతడిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించడం, అపర్ణకు రఘువీర్ పై అనుమానాలు పెరుగుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




