Home

»

Tv News

Karthika Deepam2 : శివన్నారాయణ ఆస్తులు కబ్జా చేసిన మాలిని, ప్రాణాపాయ స్థితిలో దీప!

Sep 15, 2026 11:56AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2 . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 778లో.. ఒకవైపు కుటుంబం చేసిన నిర్లక్ష్యం కారణంగా శివన్నారాయణ సామ్రాజ్యం పూర్తిగా కుప్పకూలిపోగా.. మరోవైపు యాక్సిడెంట్ కారణంగా దీప ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తుంది. ఆఫీస్ లోకి అడుగుపెట్టిన శివన్నారాయణ మరియు దశరథలకు షాక్ తగులుతుంది. సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి రానీయకుండా అడ్డుకోగా.. ఛైర్మన్ సీట్లో మాలిని దర్జాగా కూర్చుని ఉండటం చూసి శివన్నారాయణ షాక్ అవుతాడు. కొద్ది రోజుల క్రితం జరిగిన నిశ్చితార్థ వేడుక సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి గుడ్డిగా సంతకాలు పెట్టిన పత్రాల ద్వారానే ఈ అనర్థం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్లను అడ్డం పెట్టుకుని జ్యోత్స్న రెస్టారెంట్స్‌ను మాలిని తన కొడుకు సూరజ్ పేరు మీదకు మార్చుకున్నట్లు మాలిని అందరి ముందు నిజం బయటపెడుతుంది. అంతేకాకుండా ఆ ఆస్తులన్నింటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టించానని చెప్పడంతో శివన్నారాయణ కుప్పకూలిపోతాడు.

 

తమ కుటుంబం చేసిన పెద్ద తప్పును తెలుసుకుని శివన్నారాయణ, దశరథలు కుమిలిపోతారు. బోర్డ్ మెంబర్లంతా ఇప్పుడు తన గుప్పిట్లోనే ఉన్నారని, కంపెనీలో తనదే తుది నిర్ణయమని మాలిని అహంకారంతో మాట్లాడి శివన్నారాయణను మరియు దశరథను అవమానిస్తుంది. కనీసం మానవత్వం కూడా లేకుండా వారిని మెడ పట్టుకుని ఆఫీసులో నుంచి బయటికి గెంటేయడంతో శివన్నారాయణ డిస్సప్పాయింట్ అవుతాడు. మరోవైపు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీప పరిస్థితి అత్యంత విషమంగా మారుతుంది. ఈ ప్రమాదంలో దీప కడుపునకు బలమైన గాయం కావడంతో ఆమె ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తారు. దీప కడుపులో ఉన్న బిడ్డను కాపాడటం కష్టమని, అబార్షన్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు చెప్తారు.

 

దీపను కాపాడుకునేందుకు జ్యోత్స్న, సూరజ్ ఇద్దరు హాస్పిటల్ లో ఉంటారు‌. తనకి సంబంధించిన వాళ్ళు ఈ ఫామ్ మీద సంతకం చేయాలని డాక్టర్ అనగా నేను చేస్తానని సూరజ్ అంటాడు. ప్రాణాలు కాపాడే అర్హత నీకు లేదని సూరజ్ తో చెప్పి జ్యోత్స్న సంతకం చేస్తుంది. దీపకి చాలా రక్తం పోయింది.  దీప ప్రాణాలు నిలబెట్టాలంటే రక్తం కావాలని డాక్టర్ అనగానే తన రక్తాన్ని కూడా దానం చేయడానికి ముందుకు వస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com