
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 209లో.. మాధవ నిశ్చితార్థాన్ని ఎలాగైనా చెడగొట్టాలని చక్రి ఎంతో ఆశతో ఒక ప్లాన్ వేస్తాడు. తన ప్లాన్ తిరుగులేకుండా సక్సెస్ అవుతుందని గట్టిగా నమ్మి, ఇంట్లోని వాళ్లందరిని హడావిడిగా బట్టలు సర్దేయమని చెప్తాడు. అసలు ఏం జరుగుతుందో అర్థంకాక అందరు ఆశ్చర్యపోతుంటే తన తెలివితేటల మీద తనే అతిగా నమ్మకం పెట్టుకుని కలల్లో తేలియాడుతుంటాడు. కొద్దిసేపటికి జయంతి తల్లి రాగానే, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పడానికే ఆమె వస్తుందని చక్రి అనుకొని క్యాన్సిలా అని అడుగుతాడు. కానీ, తన కూతురు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లిని తము ఎందుకు రద్దు చేసుకుంటామని జయంతి తల్లి చెప్తుంది. చక్రి ఒక్కసారిగా షాక్ తగులుతాడు. పైగా మీకేమైనా కావాలా అని మర్యాదగా అడగడంతో చక్రికి ఏం మాట్లాడాలో తోచక నోట మాట పడిపోతుంది.చక్రి వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది.
ఈసారి నారాయణ రంగంలోకి దిగి మరో ఎత్తు వేస్తాడు. ఎప్పటిలాగే గయ్యాలి తాయారును రెచ్చగొట్టి, ఆమెను నేరుగా జయంతి తల్లిపైకి గొడవకు ఉసిగొలపాలని నారాయణ తన మనసులో ఒక ప్లాన్ చేస్తాడు.తాయారుకి లేనిపోనివి కల్పించి చెప్తాడు నారాయణ. ఆ మాటలను నిజమని నమ్మి తాయారు ఆవేశంతో జయంతి తల్లి దగ్గరకు గొడవకు బయలుదేరుతుంది. అయితే సరిగ్గా ఆ సమయానికి గాయత్రి అడ్డుపడి మామయ్య నిన్ను కావాలనే రెచ్చగొట్టి గొడవ పెట్టాలని చూస్తున్నాడని , నిజంగా ఆమె అలా అంటే తను సంతోస్తాడు కానీ నీతో ఎందుకు చెప్తాడని గాయత్రీ అనడంతో అవునని తాయారు ఆగిపోతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన జయంతి తల్లి ఏ మాత్రం కోపం లేకుండా ఎంతో ప్రేమగా అందరికి స్నాక్స్ పంపి.. ఇంకా ఏమైనా కావాలా అని ఆప్యాయంగా పలకరిస్తుంది. గాయత్రి చెప్పింది నిజమేనని తాయారు గ్రహిస్తుంది. నారాయణ వేసిన కుట్ర ప్లాన్ మొదటికే మోసమై నీరుగారిపోతుంది. మరోవైపు శైలు భవిష్యత్తు కోసమే మాధవ ఈ పెళ్లికి అంగీకరించాడని మహా అందరికీ అసలు నిజం వివరిస్తుంది. ఈ పెళ్లి వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకున్న గాయత్రి.. తను తెలియక నారాయణ మాటలు నమ్మి ఈ పెళ్లిని అడ్డుకోవాలని చూశానని గ్రహించి తన తప్పును తెలుసుకుంటుంది.
ఇంట్లో ఎవరి ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో కన్నా, కేశవ ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు.ఈ నిశ్చితార్థాన్ని జరిపించడానికి వస్తున్న పంతులే తమకు ఇప్పుడు ఏకైక అస్త్రమని భావించి అతనిని రహస్యంగా కలవాలని నిర్ణయించుకుంటారు.మామలుగా ఇవ్వాల్సిన సంభావన కంటే రెట్టింపు డబ్బులు ముట్టచెప్పుతామని ఆశ చూపి, నిశ్చితార్థంలో జాతకాలు కుదరలేదని అబద్ధం చెప్పాలని పంతులుతో కన్నా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





