
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -230 లో..... వీరు దగ్గరికి ఇషిక వస్తుంది. బ్రో ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఏం లేదు రేపు కళ్యాణానికి అవసరమైనవి చూస్తున్నానని అంటాడు. చూసావా రుద్ర, గంగల చేతుల మీదుగా కళ్యాణం జరుగుతుందంట.. నేను మా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు నన్ను పక్కకి నెట్టారు చూసావా అని ఇషిక అంటుంది. రుద్ర, గంగల చేతుల మీదుగా జరిగితేనా వాళ్ళు బిజీగా ఉంటారు.. మనల్ని ఎవరు పట్టించుకోరు మన పని ఈజీ గ అవుతుందని వీరు అనగానే కరెక్ట్ బ్రో అని ఇషిక అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి శకుంతలని కళ్యాణం దగ్గరికి వచ్చేలా రెచ్చగొడతారు.
మరుసటిరోజు ఇందుమతి రెడీ అయి కోడలు కొడుకు దగ్గరికి వెళ్తుంది. సూర్య,ఇషిక రెడీ అవుతారు ఇద్దరు బాగున్నారు. మీ చేతిలో ఒక బేబీ ఉంటే బాగుంటుందని ఇందుమతి అనగానే సరే నేను వెళ్తున్నానని ఇషిక అక్కడ నుండి వీరు దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. తన వెనకాలే ఇందుమతి, సూర్య వెళ్తారు. దూరం నుండి వాళ్ళు మాట్లాడుకునేది వింటారు. బిజినెస్ గురించి అయి ఉంటుందని ఇద్దరు అనుకుంటారు. నేను అంతా చూసుకుంటాను. నువ్వు వెళ్లి మీ అత్తయ్య కోరిక తీరాలని మొక్కుకని వీరు అంటాడు. ఆ మాట ఇందుమతి విని వీరు ఎంత మంచోడు అని అనుకుంటుంది. ఇషిక అక్కడ నుండి వచ్చాక ఏంటి ఇషిక వీరుతో ఏం మాట్లాడుతున్నవని అడుగుతుంది. కొంపదీసి విందా ఏంటి అని ఇషిక టెన్షన్ పడుతుంది. వినలేదని తన మాటల్లో అర్థమవుతుంది. ఆ తర్వాత వీరు జ్యూస్ తీసుకొని వెళ్తుంటే రంగా ఎదరుపడతాడు.
ఏంట్రా చుట్టంచూపులాగా వచ్చావ్ .. న్ని రోజులు ఇక్కడే ఉంటావని రంగాని వీరు అడుగుతాడు. అప్పుడే రుద్ర వచ్చి రంగాకి సైగ చేస్తాడు. అవును ఎన్ని రోజులు ఉంటావ్ ఇలా ఎవరు లేకుండా వచ్చి ఇక్కడే సెటిల్ అవుదామని అనుకుంటున్నావా అని రుద్ర అనగానే అప్పుడే గంగ వచ్చి మా అన్నయ్య ఏమైనా ఇక్కడే ఉండి కుట్రలు చేస్తున్నాడనుకుంటున్నారా అని వీరు మైండ్ బ్లాంక్ అయ్యేలా మాట్లాడతారు. ఎవరు ఎన్ని రోజులు అయినా ఉండొచ్చు.. నేను సరదాగా అన్నానని వీరు అంటాడు. ఆ తర్వాత కళ్యాణానికి కార్తీక్, మక్కామ్ ని కూడా పిలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






