Home

»

Tv News

Karthika deepam2 :దీపకు పీడకలలు.. జ్యోత్స్న అసలు ప్లాన్ ఏంటి.. ఉత్కంఠగా సాగుతున్న కార్తీక దీపం ఎపిసోడ్!

Mar 26, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం'(Karthika deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -627 లో..... దీప నిద్రలో‌ నుండి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి అమ్మ అంటుంది. దాంతో కార్తీక్ లేస్తాడు. ఏమైందని అడుగుతాడు. మనం మా ఇంటికి వెళదాం. అమ్మనాన్నని చూడాలని ఉందని దీప అనగానే అందరు బానే ఉన్నారు.. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావని కార్తీక్ అంటాడు. మరొకవైపు సుమిత్ర దగ్గరకి దశరథ్ వచ్చి మాట్లాడతాడు. అప్పుడే జ్యోత్స్న వచ్చి లోపలికి రావచ్చా అని అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నావని సుమిత్ర అంటుంది.

డాడీ ఈ మధ్య నీకు దూరంగా ఉండమన్నాడని జ్యోత్స్న అంటుంది. మీరు నన్ను చిన్నప్పుడు ఎంతో గారాబంగా చూసారు కానీ ఇప్పుడు అలా లేరని జ్యోత్స్న అంటుంది. ఎప్పుడు అయితే నువ్వు దాస్ కూతురివి అని తెలిసిందో నీ మీద ప్రేమ లేదని దశరథ్ మనసులో అనుకుంటాడు. జ్యోత్స్న నువ్వు పెళ్లి చేసుకో.. అప్పుడు నేను హ్యాపీ అని సుమిత్ర అంటుంటే ఇప్పుడే వద్దని జ్యోత్స్న వెళ్తుంటుంది. జ్యోత్స్న పడిపోబోతుంటే దశరథ్ పట్టుకుంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న అక్కడ నుండి వెళ్ళాక సుమిత్ర తనలో తాను మాట్లాడుకుంటుంది. ఏంటని దశరథ్ అడిగితే నేను ఏమన్నానని సుమిత్ర అంటుంది. సుమిత్ర ప్రవర్తనలో తేడా దశరథ్ గమనిస్తాడు. డాక్టర్ హారికకి ఫోన్ చేసి రమ్మంటాడు.

మరుసటి రోజు కార్తీక్ వాళ్ళు శివన్నారాయణ ఇంటికి వస్తారు. అప్పుడే డాక్టర్ వస్తుంది. సుమిత్ర తో కాసేపు మాట్లాడి శివన్నారాయణ కార్తీక్, దశరథ్ ని పక్కకీ తీసుకొని వెళ్లి సుమిత్ర ఇప్పుడు చాలా డెలికేట్ అయింది. తనకి జ్యోత్స్న అంటే ప్రాణం తన గురించి ఏం నెగెటివ్ గా చెప్పిన తన బిహేవియర్ లో తేడా వస్తుంది. ఇప్పుడు తనకి మీ సపోర్ట్ కావాలని డాక్టర్ చెప్తుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. డాక్టర్ వెళ్ళాక జ్యోత్స్న నీతో మాట్లాడాలని కార్తీక్ తనని పక్కకి తీసుకొని వెళ్తాడు. పారుని పంపించి ఎందుకు వీడియో కాల్ చెయ్యమన్నావ్ అలాగే శౌర్యని కిడ్నాప్ చేసింది కూడా నువ్వేనని నాకు తెలుసని కార్తీక్ అనగానే జ్యోత్స్న ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే అడుగు జ్యోత్స్న అని కార్తీక్ అనగానే నేను చాలా క్లియర్ గా ఉన్నానని జ్యోత్స్న చెప్తుంది. నా డౌట్ ఏంటో త్వరలోనే క్లియర్ అవుతుంది.. ఆ పని మీదే ఉన్నానని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com