
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -428 లో.. ధీరజ్ బయట పడుకుని ఉంటాడు. ప్రేమ తన పక్కకి వచ్చి పడుకుంటుంది. ధీరజ్ నిద్ర నుండి లేచి ప్రేమకి దుప్పటి కప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కాసేపటికి ప్రేమ లేచి కప్పిన దుప్పటి చూసి మురిసిపోతుంది. ఆ తర్వాత విశ్వని ఒకటి చేయమంటే ఇంకొకటి చేసాడని భద్రవతి, సేనాపతి మాట్లాడుకుంటారు. అది విని నా కొడుకుకి అలాంటివి చెప్పి వాడిని స్టేషన్ లో ఉండేలా చేశారని రేవతి అంటుంది. సేనాపతి కోప్పడతాడు. నువ్వు ఆగు రేవతి నేను విశ్వని బయటకు తీసుకొని వస్తానని భద్రవతి అంటుంది. ఎక్కడ బయటకు వస్తాడు ఆ రామరాజు తో రాజీ కుదర్చుకుంటే తప్ప బయటకు రాడని ఇన్‌స్పెక్టర్ చెప్పాడు కదా అని రేవతి అనగానే మేం వాళ్ళని అడగడమేంటి.. నువ్వు నీ ముద్దుల కూతురు ఉంది కదా వెళ్లి అడుగుపోమని సేనాపతి అంటాడు. నా కూతురిని రిక్వెస్ట్ చేస్తానని రేవతి అంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. తను మాట్లాడింది ఫోన్ రికార్డింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని భాగ్యంతో శ్రీవల్లి చెప్తుంది.
నువ్వు కంగారుపడకు.. నేను ఉన్నాను కదా నేను ఏదో ఒకటి ఆలోస్తానని భాగ్యం అంటుంది. ఆ తర్వాత ముగ్గువేస్తున్న నర్మద దగ్గరికి ప్రేమ వచ్చి.. అక్క నాకు రాత్రి ధీరజ్ దుప్పటి కప్పాడు. ధీరజ్ నన్ను క్షమించినట్లేనా అని ప్రేమ అంటుంటే.. నీ మీద తనకి కోపం అసలు ఉండదని నర్మద అంటుంది. ఆ తర్వాత ప్రేమని రేవతి దగ్గరికి పిలిచి మీ అన్నయ్య విశ్వని బయటకు తీసుకొని రమ్మని చెప్తుంది. వాళ్ళు అలా మాట్లాడుకోవడం శ్రీవల్లి వెళ్లి వేదవతికి చెప్తుంది. నర్మద, ప్రేమ అక్కడ మాట్లాడుతున్నారని శ్రీవల్లి అంటుంది. వాళ్ళు నాకు శత్రువులు.. వాళ్ళ గురించి నా దగ్గర తీస్తావా అని శ్రీవల్లి చెంప వాయిస్తుంది. ఆ తర్వాత అన్నయ్య తప్పు చేసాడు కాబట్టి శిక్ష పడాల్సిందేనని ప్రేమ అనగానే భద్రవతి వచ్చి ప్రేమని కొడుతుంది. దాంతో అది ధీరజ్ చూసి వచ్చి గొడవ పెట్టుకుంటాడు.. మీకు చేతకాక రాజీకి వచ్చారు. నేను చెప్పింది చేస్తే పది నిమిషాల్లో విశ్వ గాడు బయటకు వస్తాడని ధీరజ్ అనగానే ఏంటని భద్రవతి అడుగుతుంది.
రామరాజుని ధీరజ్ పిలిచి వాటర్ ముందు పెట్టి మా నాన్న కాళ్ళు కడిగి క్షమించమని అడగాలని ధీరజ్ అనగానే భద్రవతి కోపంగా వాటర్ పడేస్తుంది. నా అల్లుడిని ఎలా బయటకు తీసుకొని రావాలో నాకు తెలుసని భద్రవతి అంటుంది. ఇన్నిరోజులు నన్ను దొంగ దెబ్బ కొట్టారు కానీ ఇప్పుడు నా వెనకాల నా కొడుకులున్నారని రామరాజు అంటాడు. ఆ తర్వాత అందరు లోపలికి వెళ్తారు. ప్రేమ బాధపడుతుంటే నర్మద లోపలికి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






