Home

»

Tv News

Jayam serial:ఇషికకు విడాకుల వార్నింగ్ ఇచ్చిన సూర్య.. ఇంటి పెద్దపై వీరు కుట్ర!

Mar 26, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -226 లో.... ప్రమీలని తీసుకొని గంగ, రుద్ర వస్తుంది. సూపర్ మార్కెట్ కి వస్తారు. అక్కడే కార్తీక్ ఎదురవుతాడు. ఆ తర్వాత ఇషిక దగ్గరికి ఇందుమతి వస్తుంది. ఏ ఇషిక పిలిస్తే వినిపించడం లేదా కాఫీ తీసుకొని రా అంటుంది. ఏంటి అత్తయ్య నిన్నటి నుండి పనులు చెప్పి చంపేస్తున్నారని ఇషిక అంటుంది. అలా ఇషిక కోప్పడడం సూర్య, రాఘవ చూస్తారు. ఏంటి మా అమ్మపై కోపానికి వస్తున్నావ్.. మొన్నటి వరకు మగరాయుడులాగా ఇంట్లో పనులు చెయ్యకుండా తినేసి ఆఫీస్ కి వెళ్ళావ్.. ఇప్పుడు ఇంట్లో ఖాళీగానే కదా ఉన్నావ్.. మా అమ్మ చెప్పింది చెయ్యకపోతే విడాకులు ఇస్తానని సూర్య అంటాడు.

దాంతో ఇషిక షాక్ అవుతుంది. లేదు సూర్య చెప్పినట్లు వింటానని ఇషిక అంటుంది. సూర్య, రాఘవ అక్కడ నుండి వెళ్ళిపోతారు. చూసావ్ కదా వెళ్లి కాఫీ తీసుకొని రా అని ఇందుమతి అంటుంది. మరొకవైపు రంగా, గంగ కావాలానే ప్రమీల వెనకాల తిరుగుతూ పాపం ఆ కార్తీక్ అనే అతను మంచివాడిలా ఉన్నారని అంటారు. అక్క నువ్వు అతనికి థాంక్స్ చెప్పావా అని ప్రమీలని గంగ అడుగుతుంది. చెప్పానని ప్రమీల అంటుంది. నేను అయితే ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చేదాన్ని ఒక్క రోజులో అనుకోకుండా ముడుసార్లు కలవడమంటే మాములు విషయం కాదు.. ఏదో కారణం ఉండి ఉంటుందని గంగ అనగానే ప్రమీల అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు వీరు దగ్గరికి ఇషిక వచ్చి ఏంటి బ్రో మన పరిస్థితి ఇలా అయింది. నేను వంటింటికి పరిమితం అయ్యానని ఇషిక అంటుంది. ఇక ఆలస్యం చెయ్యొద్దు. ఇంటికి పెద్ద దిక్కుని లేకుండా చెయ్యాలి. అప్పుడే ఆ రుద్రని ఎదురుకోవచ్చని వీరు అనగానే పెద్ద మావయ్యనా అని ఇషిక షాక్ అవుతుంది.

మరొకవైపు సూపర్ మార్కెట్ కి పెద్దసారు కోసం తన దగ్గర వర్క్ చేసిన అతను వస్తాడు. అతను లేడని తెలిసి వెళ్లిపోతుంటే రుద్ర ఎదురుపడి మాట్లాడతాడు. అతను వెళ్తుంటే ఆపి ఒక ఫోటో చూపించి ఇతను ఎవరు అంటాడు. అతను మీ పెద్దనాన్నని చంపాలని చూసాడు. పోలీసులకి అప్పగించారు. పోలీస్ స్టేషన్ నుండి వచ్చాక చచ్చిపోయాడని అతను చెప్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారని అతను అనగానే ఫైల్స్ చూస్తుంటే కన్పించింది అందుకే అడిగానని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com