Home

»

Tv News

Karthika Deepam2 : జ్యోత్స్న పెళ్లి కోసం కొత్త కండీషన్.. కార్తీక దీపం 2లో అనూహ్య మలుపులు!

May 07, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -663 లో..... జ్యోత్స్న ఏదో ప్లాన్ తోనే ఇదంతా చేసింది అని కార్తీక్ తో దీప అంటుంది. ఏం చేసినా  తనకి సమాధానం నేనే చెప్తానని కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేసి.. బాల్కనీలోకి మీరు ఇద్దరు రండి మాట్లాడాలని అంటుంది. మరొకవైపు మీరేంటి  అక్కడ జ్యోత్స్నకి సపోర్ట్ చేస్తున్నారని శ్రీధర్ తో కాంచన అంటుంది. అది కాదు నాకు జ్యోత్స్న చేసేది కరెక్ట్ అనిపిస్తుందని శ్రీధర్ అంటాడు.

కార్తీక్ కి  అగ్రిమెంట్ క్యాన్సిల్  చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది కానీ కార్తీక్ చేసుకోలేదు.. జ్యోత్స్న అగ్రిమెంట్ వెనకాల దీప ఉందనిపిస్తుంది. అది నువ్వే కనుక్కోవాలి.  ఇప్పుడే కార్తీక్ ని గట్టిగా అడుగుమని శ్రీధర్ చెప్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి  కార్తీక్, దీప వెళ్తారు. ఏంటి పిలిచావని కార్తీక్ అడుగుతాడు. నేను ఒక ఆఫర్ ఇచ్చాను కదా .. నా పెళ్లి అయితే అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందని దానికి మీరు నాకు  థాంక్స్ చెప్పాలి కానీ మీరు చెప్పలేదు థాంక్స్ చెప్పించుకోవడానికి పిలిచానని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే.. ఇప్పుడే కిందకి వెళ్లి ఆ వైరాతో చేతులు కలిపావని చెప్తానని దీప అంటుంది. ఏంటి మీ వాళ్ళకి ఏం కాదని కాన్ఫిడెంట్ వచ్చిందా అని జ్యోత్స్న అంటుంది. ఏమైనా అయితే నీ సంగతి చెప్తానని జ్యోత్స్నకి  దీప మాస్ వార్నింగ్ ఇస్తుంది.

ఆ తర్వాత శివన్నారాయణ, దశరత్ లతో కార్తీక్ మాట్లాడతాడు. మనం ఒక సామర్ధ్యం గలా అతన్ని సీఈఓ గా  చేసి అతన్ని దగ్గర నుండి చూద్దాం. అతను బాగా  వర్క్ చేస్తే అతనితో  జ్యోత్స్న పెళ్లి చేద్దామని కార్తీక్ సలహా ఇస్తాడు. దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ తర్వాత బోర్డు మెంబర్స్ ని జ్యోత్స్న ఇంటికి రప్పిస్తుంది. మీరు సీఈఓగా మీ అల్లుడిని తొలగించారట కదా .. మరి కొత్త సీఈఓ ఎవరు.. ఒకవేళ బయట నుండి ఎవరినైనా తీసుకొని వస్తే మీకు సామర్ధ్యం లేకే బయట నుండి తెచ్చారనుకుంటారని  వాళ్ళు అంటారు. నేను ఆలోచిస్తాను.. మీరు వెళ్ళండి అని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత సూరజ్ క్యాబ్ కోసం చూస్తుంటే అటుగా వెళ్తున్న జ్యోత్స్న చూసి గిఫ్ట్ షాప్ లో జరిగిన గొడవ గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే  తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com