.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -464 లో.....నర్మద అక్క ఇంట్లో నుండి ఎక్కడ బయటకు వెళ్ళిపోతుందోనని చాలా టెన్షన్ అయ్యానని ధీరజ్ తో ప్రేమ చెప్తుంది. నీ ముద్దుల అక్కని ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఆపాను కదా అని ధీరజ్ అంటాడు. మరొకవైపు వల్లి తనకి నచ్చినట్లు ఫుడ్ తింటుంది. నర్మద, ప్రేమ దగ్గరికి చందు వచ్చి వల్లి కడుపుతో ఉంది కదా పుల్లటివి తినాలని అన్పిస్తుందని మామిడికాయలు తీసుకొని వచ్చి వల్లికి ఇవ్వమని ఇస్తాడు. మీరే ఇవ్వొచ్చు కదా బావ అని ప్రేమ అంటుంది. తను చేసిన మోసానికి తనని ఎదురుగా చూడలేకపోతున్నానని చందు అంటాడు.
ఆ తర్వాత ప్రేమ, నర్మద వెళ్లేసరికి వల్లి వాళ్ళ అమ్మ పంపిన పీతలకూర వేసుకొని తింటుంది. అది చూసి కడుపుతో ఉన్నవాళ్లు పీతల కూర తినొద్దు.. ఆ విషయం మీ అమ్మకి తెలియదా అని నర్మద అంటుంది. వేదవతిని పిలిచి విషయం చెప్తుంది. మీ అమ్మకి ఆ మాత్రం తెలియదా అని వేదవతి కోప్పడుతుంది. నువ్వు ఇంకొకసారి నాకు తెలియకుండా ఏం తినొద్దని వేదవతి చెప్తుంది. తన దగ్గర నుండి బయటకు వచ్చాక.. అసలు వల్లి అక్క కడుపుతో లేదని అనిపిస్తుందని నర్మద అంటుంది. అలా అంటావేంటని వేదవతి అంటుంది. మరి వాళ్ళ అమ్మ పీతల కర్రీ పంపడం ఏంటని నర్మద అనగానే ఆ మాటలు వల్లి వింటుంది.
ఏం అంటున్నారు.. నాకు కడుపు లేదా.. నాకు కడుపు వచ్చిందని మీకు కుళ్ళు అని వల్లి అంటుంది. వాళ్ళు అలా అనడం లేదని వేదవతి అంటుంది. ఇప్పుడే హాస్పిటల్ కి వెళదాం పదండి అని వాళ్ళిద్దరిని వల్లి లాక్కొని హాస్పిటల్ కి వెళ్తుంది. డాక్టర్ మీరు చెప్పండి.. వాళ్ళు నాకు కడుపు లేదని అంటున్నారు.. ఇప్పుడే స్కానింగ్ తీసి చూపించండి అని వల్లి అంటుంది. నర్మద, ప్రేమని డాక్టర్ బయటకు పంపించి శ్రీవల్లి చెంపచెల్లుమనిపిస్తుంది. మీ అమ్మ, నువ్వు నాతో నాటకాలు ఆడుతున్నారా.. మీ అమ్మ నా కూతురు కాపురం బాగుండాలని అబద్ధం చెప్పమంటే.. నీకు లేని కడుపుని ఉన్నట్లు చెప్పానని డాక్టర్ చెప్తుంది. దాంతో వల్లి షాక్ అవుతుంది. ఏడుస్తుంది.. నీకు మీ అమ్మ నిజం చెప్పిందనుకున్నా అని డాక్టర్ అంటుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు నా కాపురం నిలబెట్టాలని డాక్టర్ ని వల్లి రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
