.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1025 లో...రాజేష్ తన డబ్బుల కోసం ఐశ్వర్య దగ్గరికి వస్తాడు. నువ్వు ఇలా అయితే ఇవ్వవు.. నేను వెళ్లి మీ ఆంటీని అడుగుతానని రాజేష్ అనగానే నువ్వు వెళ్లి అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వదు.. నేనే ఇస్తాను కాస్త టైమ్ ఇవ్వమని ఐశ్వర్య రిక్వెస్ట్ చేస్తుంది. దానికి రాహుల్ సరే అంటాడు. ఆ తర్వాత లక్కీకి ఐశ్వర్య ఫోన్ చేసి డబ్బు అడుగుతుంది. రాజు తనతో ఫోన్ లో మాట్లాడుతాడు. ఒరేయ్ నాకు డబ్బు ఇవ్వు అంటుంది. ఒరేయ్ అంటూ మాట్లాడుతున్నావని రాజు కోప్పడతాడు.
నువ్వు ఇలా మాట్లాడితే నీకన్నా దిగజారి మాట్లాడగలను.. ఉన్నప్పుడు ఇస్తానని రాజు కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. ఎందుకురా అలా మాట్లాడుతున్నావ్.. మనమే డబ్బు ఇవ్వాలని లక్కీ అంటాడు. అర్ధం అయింది. నీకు నా అవసరం అయిపోయింది.. ఇక నాతో నీకేం పని అని లక్కీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఒరేయ్ లక్కీ నేను చెప్పేది విను అని రాజు తన వెనకాలే వెళ్తాడు. ఆ తర్వాత కిచెన్ లో అపర్ణ, స్వాతి ఇందు వంట చేస్తూ సరదాగా మాట్లాడుకుంటారు. అప్పుడే రేఖ పిలుస్తుంది. హాల్లో పంతులు గారు కూర్చొని ముహూర్తం చూస్తాడు. పూజ ఏమైనా ఉందా అని స్వాతి అడుగుతుంది. లేదు మదన్ తో ఇందు పెళ్లి అనగానే అందరు షాక్ అవుతారు. వద్దని అపర్ణ కోప్పడుతుంది. ఎంత చెప్పినా రేఖ వినదు. ఆ తర్వాత రేఖ ఇందు, స్వాతి మాట్లాడుకుంటారు. ఇది నీ జీవితం.. తను చెప్పినట్లు చేయకు పెళ్లి అంటే జీవితాంతం తనతో కలిసి ఉండాలని అపర్ణ చెప్తుంది.
ఆ తర్వాత స్వాతి ఏడుస్తూ బయట కూర్చొని ఉంటుంది. ఇందు వచ్చి ఏమైందని అడుగుతుంది. నేను ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్తుంది. నువ్వు ఏడవకు అతన్ని నిన్ను కలుపుతాను.. ఎవరు అతను అని ఇందు అడుగుతుంది. రేపు నువ్వు పెళ్లి చేసుకోబోయే మదన్ అని స్వాతి అనగానే ఇందు షాక్ అవుతుంది. అతనికి తెలుసా అని ఇందు అడుగుతుంది. లేదని స్వాతి చెప్తుంది. అతనితో నా పెళ్లి జరగదు ఒకేనా అని స్వాతికి ఇందు ధైర్యం చెప్తుంది. తరువాయి భాగంలో ఇందు, రాజు పెళ్లి చేసుకొని వస్తారు. వాళ్ళని చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

