.webp)
స్టార్ మాలో ఫ్యామిలీ స్టార్ ప్రతీ వారం నవ్వుల విందు ఇవ్వడానికి వచ్చేస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో పవిత్ర ఘోస్ట్ లాగా రెడీ అయి స్టేజ్ మీదకి రాగానే.. మీ దెయ్యాలలో అందంగా ఉన్నవాళ్లు లేరా అని సుడిగాలి సుధీర్ అడుగుతాడు. దెయ్యాల్లో అందంగా ఉంది అంటే అది నేనే అని పవిత్ర అనగానే అందరు నవ్వుతారు. కాంచనతో పెట్టుకున్నావంటే మంచానికి పనికి రాకుండా పోతావని అషు పైకి వస్తుంది కొమురవ్వ.
ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ఏదో ఆలోచిస్తూ.. నువ్వు మనిషివేనా అసలు? క్యారివ్యాన్ లో ఆ సౌండ్ లు ఏంటని సుధీర్ పై కోప్పడుతాడు. దాంతో అందరు నవ్వుతారు. వర్ష వస్తుంటే.. ఎవరు ఈవిడ అని సుధీర్ అనగానే మసూధ అని వర్ష చెప్తుంది. మత్తుకి సూది వేసేదానిలా ఉంది, మసూధ అంటావేంటని సుధీర్ అనగానే అందరు నవ్వుతారు.
ఈ ఎపిసోడ్ అయ్యేలోపు నీ బావ నా వశం.. కాదు కాదు నీ వశం అయ్యేలా చేస్తానని అన్షుతో అరియాన అంటుంది. అప్పుడే ఐశ్వర్య పిల్లి సాంగ్ తో ఎంట్రీ ఇస్తుంది. తనని సుధీర్ ఫ్లర్ట్ చేస్తాడు. తనని అలా ఫ్లర్ట్ చేస్తుంటే "నో నో" అంటూ అన్షు సుధీర్ పై అరుస్తుంది. ఇక అందరు తమ పాత్రలకి న్యాయం చేస్తూ తమదైన స్టైల్ లో నవ్వించారు. సుధీర్ కామెడీ టైమింగ్ కి అందరు ఫిదా అవ్వాల్సిందే. పవిత్ర ఘోస్ట్ క్యారెక్టర్ లాగా బాగా చేసింది కుమురవ్వ దెయ్యాన్ని నిద్రపుచ్చడం అందరికి నచ్చేస్తుంది. నాన్న నన్ను ఎత్తుకో అంటూ అందరు సుధీర్ దగ్గరికి వస్తారు. నాకు తెలియకుండా ఇన్ని సెటప్ లు పెట్టావా అని సుధీర్ పై కొమురవ్వ కోప్పడుతుంది. డబుల్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Family Star, Family Star Promo, Star Maa, Sudigali Sudheer, Pavithra, Komuravva, Ashu Reddy, Nataraj Master, Varsha, Ariyana]





