
బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం నామినేషన్ తో అసలు రంగులు బయటపడ్డాయి. ఇప్పటివరకు ఫ్రెండ్లీగా ఉన్న కంటెస్టెంట్లు ఒక్కొక్కరు తమ మాస్క్ తీసేస్తున్నారు. ఈ వారం నామినేషన్ లో సుధీర్, వర్షిణి, ముఖేష్ టీం మొత్తం కలిసి త్రిగుణ్ ని టార్గెట్ చేయగా, రామ్ ప్రసాద్ మాత్రం వంశీని నామినేట్ చేశాడు. మొత్తం ఎపిసోడ్ షాలినీ vs వర్షిణి, సుధీర్ vs త్రిగుణ్ vs శ్రిష్టి గొడవలతో హీటెక్కింది.
మొదటగా వంశీని రామ్ ప్రసాద్ నామినేషన్ చేస్తాడు. కిచెన్ లో జరిగిన చిన్న గొడవతోనే నామినేషన్ మొదలైంది. నువ్వు లేని పర్సనాలిటీని క్రియేట్ చేసుకుంటున్నావ్.. గొడవ లేని చోట కూడా అంతలా అరవాల్సిన అవసరం లేదనిపించింది.. ఫుడ్ పెట్టి అలా అరిస్తే కొందరు బాధపడతారు. నాకొచ్చి చెప్పుకొని ఏడ్చారంటూ వంశీతో రామ్ ప్రసాద్ అంటాడు. వంట విషయంలో వర్షిణి ఏడవడంపై వంశీ.. అసలు ఎందుకు ఏడ్చారో తెలీదు, మేం ఏదో దాచిపెట్టినట్టు బిహేవ్ చేశారన్నాడు. దానికి వర్షిణి ఆయిల్ ఉందని అప్పుడే చెప్పాను, నాకు బాధేసి ఏడ్చానని బదులిచ్చింది. చిన్న చిన్న విషయాలకే పెద్దగా అరుస్తావ్, అది నాకు నచ్చలేదన్నాడు. ఎవరిది వాళ్లు ఆమ్లెట్ వేసుకుంటున్నారు, మీరు ఎలా వేసుకుంటున్నారో మాకు తెలీదని ఝాన్సీ అనగా నేను నా గురించి కాదు, అందరి గురించి ఆలోచిస్తానని వంశీ ఎమోషనల్ అయ్యాడు. రోజూ అన్నం పెట్టే వాడి మీదే చెత్త వేస్తున్నావ్, గ్రేట్ అంటూ త్రిగుణ్ చప్పట్లు కొట్టాడు. ఇలానే పక్కన ఉంటూ ట్రిగ్గర్ చేస్తాడు, చూసుకోమని వంశీకి రామ్ ప్రసాద్ చెప్తాడు.
ఆ తర్వాత షాలినిని వర్షిణి నామినేషన్ చేసింది. ప్రోమోలో కనిపించను, ఎపిసోడ్ లో ఉండనని సీన్ చేస్తున్నావని రీజన్ చెప్తుంది వర్షిణి. దానికి షాలినీ.. అది మీ పర్స్పెక్టివ్ . అనగా అవును నా పర్స్పెక్టివ్ ఏ, నువ్వు ఫేక్ గా ఉంటున్నావని వర్షిణి తేల్చి చెప్పింది. నాకు డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి ఒప్పుకుంటా, కానీ అవసరం లేని చర్చలు పెట్టే టైపు కాదని.. నాకు ఏ ఎమోషన్ వస్తే దానికి తగ్గట్టుగా ఉంటానని షాలినీ కౌంటర్ ఇచ్చింది. అది నాకు నచ్చలేదని వర్షిణి అనగా నీకు నచ్చినట్టు నేను ఎందుకుంటా.. నాకు నచ్చినట్టు నేనుంటానని షాలిని తెగేసి చెప్తుంది.
[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Bigg Boss Telugu Nominations, Trigun, Sudheer, Varshini, Mukesh Gowda, Ram Prasad, Vamsi, Shalini]




.webp)
.webp)
