Home

»

Tv News

Jayam serial :శకుంతల అసలు కుట్ర బట్టబయలు.. గంగను టార్గెట్ చేయడానికి అసలు కారణం ఇదే!

Aug 25, 2026 9:57AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్  జయం Jayam . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్  355 లో..... శకుంతల చీరపై గంగ అనుకోకుండా అన్నం పడేస్తుంది. దాంతో గంగని శకుంతల కొడుతుంది. నీకు కళ్ళు నెత్తికెక్కాయ అని కోప్పడుతుంది. ఆ మాత్రం దానికి కొట్టాలా అని పెద్దసారు అంటాడు. మీరు మాట్లాడకండి అని శకుంతల అంటుంది. ఎంతలో ఉండాలో అంతలో ఉండమని గంగని శకుంతల కోప్పడుతుంది. అదంతా రుద్ర చూస్తాడు కానీ సైలెంట్ గా ఉంటాడు.

 

ఆ తర్వాత గంగ దగ్గరికి ఒకసారి వెళ్ళొస్తానని సుధా వెళ్ళబోతుంటే నాన్నగారు చాలా సార్లు కాల్ చేసాడని జయ చెప్పగానే సుధా ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రామనాధం అసిస్టెంట్ ని స్టోర్ రూమ్ లో వీరు కట్టిపడేస్తాడు. తన దగ్గరికి వచ్చి ఇంకొకసారి బ్లాక్మెయిల్ చెయ్యకని డబ్బు ఇచ్చి పంపిస్తాడు. ఆ తర్వాత శకుంతల అద్దం ముందు నిల్చొని నువ్వు ఇలా ఏడవడం కావాలి గంగ.. నువ్వు ఏడుస్తుంటే మీ అమ్మ సుధట ఏడుస్తున్నట్లుంది.. అందుకే నిన్ను టార్చర్ చేస్తున్నానని శకుంతల అనుకుంటుంది. అలా శకుంతల మాట్లాడిన మాటలు వీరు, ఇషిక విని షాక్ అవుతారు.

 

అంటే ఆ రామనాథం అత్తయ్యకి నిజం చెప్పాడు కానీ అత్తయ్య చెప్పకుండా గంగపై పగ తీర్చుకుంటుంది. మనం కూడా ఆ  గంగపై కోపం వచ్చేలా చేద్దామని ఇషిక, వీరు అనుకుంటారు. మరొకవైపు అమ్మగారు కావాలానే ఇదంతా చేస్తున్నారని రంగతో గంగ చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత మన ఇంటికి ఎవరో వచ్చారు. స్టోర్ రూమ్ లో ఈ తాళ్లున్నాయి అంతేకాకుండా చెప్పులున్నాయి. బయట ఒక కర్ర కన్పించిందని రుద్ర ఇంట్లో వాళ్లకి చెప్తాడు. ఒకసారి సీసీటీవీ చూద్దామని గంగ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com