Home

»

Tv News

Illu Illalu Pillalu: లంచం డబ్బుతో నర్మదకి అడ్డంగా దొరికిపోయిన సాగర్

Aug 25, 2026 10:02AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 560 లో....సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం 25 లక్షలు అప్పు చేసి కొనుక్కున్న సంగతి తెలిసిందే. ఆ అప్పు తీర్చడానికి ఇప్పుడు ఆఫీసులో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచం తీసుకోవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో నర్మద భోజనం పట్టుకొని ఆఫీసుకి వెళ్తుంది. కాంట్రాక్టర్ ఇచ్చిన డబ్బు కవర్ ని సాగర్ జేబులో పెట్టుకోవడం నర్మద కళ్లారా చూస్తుంది. వెంటనే ఆ కవర్ లాక్కొని చూస్తే అందులో కట్టల కొద్దీ డబ్బు ఉంటుంది. అడ్డంగా దొరికిపోయిన సాగర్ మాటలు తడబడతాయి. ఇది ఆఫీస్ ఫైల్స్ అని అబద్ధం చెప్తాడు.

 

దీంతో నర్మదకు కోపం ఆగదు. నిన్ను నిజాయితీగా బతకమని చెప్పాను, లంచాలు తీసుకోమని కాదు. మా నాన్న నిన్ను నమ్మి ఉద్యోగం ఇప్పించారు, ఆయన పరువు ఏం కావాలంటూ నర్మద గట్టిగా వాయిస్తుంది. అప్పు తీర్చడానికే తీసుకున్నా అని సాగర్ అన్నా నర్మద వినదు. ఈ డబ్బు వెంటనే వెనక్కి ఇచ్చేయ్, లేకపోతే మామయ్యకి చెప్తానని వార్నింగ్ ఇస్తుంది. ఇంకోవైపు ప్రేమ, ధీరజ్ మధ్య గొడవ జరుగుతుంది. ప్రేమ ఎస్ఐ ఎగ్జామ్ కోసం రన్నింగ్ ప్రాక్టీస్ కి వెళ్తుంటే ధీరజ్ సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. నా కల నా బాధ్యత, నీ సహాయం నాకు అవసరం లేదని ప్రేమ కోపంగా అంటుంది.

 

ఇంట్లో భాగ్యం, వల్లి కలిసి ఇంకో కుట్ర చేస్తారు. నర్మద తాకట్టు పెట్టిన నగల విషయంలో జ్యువెలరీ షాప్ కి వెళ్లి .. 10 లక్షల నగలకు 20 లక్షలు ఎలా ఇచ్చావు.. రామరాజుకి చెప్పావా అని భయపెడతారు. బయటకు వచ్చి.. ఇప్పుడు నర్మద కాపురం కచ్చితంగా చెడిపోతుందని సంతోషపడతారు.చివర్లో నర్మద ఏడుస్తూ ఇంటికి వస్తుంది. వేదవతి, రామరాజు ఏమైందని అడిగినా చెప్పకుండా తప్పించుకుంటుంది. సాగర్ భయంతో ఇంటికి రాకుండా బయటే ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com