
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 44 లో.....గీత ఇంటికి వెళ్ళడానికి రత్నం రెడి అవుతుంది. అంజలిని పిలిచి నువ్వు కూడా బట్టలు సర్దుకో.. నాతో పాటు రావాలి కదా అంటుంది. నేను ఎందుకు అమ్మమ్మా అని అంజలి అడుగుతుంది. నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉండాలి కదా అని అంటుంది. దాంతో అంజలి బట్టలు సర్దుకోవడానికి వెళ్తుంది. మనీష్ కి టెన్షన్ అవుతుంది. మరొకవైపు మా అమ్మ వస్తుంది. తనని జాగ్రత్తగా చూసుకోవాలని పనిమనిషికి గీత చెప్తుంది.
మా అమ్మ వస్తుందని గీత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే బానుకి మనీష్ ఫోన్ చేసి నానమ్మతో పాటు అంజలి కూడా వస్తుందని చెప్తాడు. దాంతో భాను షాక్ అవుతాడు. అసలు అంజలి లేదు కదా ఎక్కడ నుంచి వచ్చిందని అడుగుతాడు. నానమ్మ తీసుకొని రమ్మంది తీసుకొని వచ్చాను. ఇప్పుడు అంజలి కూడా వస్తుంది. అత్తయ్యని మీరే కన్విన్స్ చెయ్యలని మనీష్ చెప్తాడు. ఆ తర్వాత రత్నం అంజలిని తీసుకొని మనీష్ బయల్దేరతాడు.
అంజలి కార్ దిగడం చూసి గీత షాక్ అవుతుంది. నువ్వు ఎందుకు వచ్చావ్.. అసలు నిన్ను పంపించేసాను కదా అని గీత కోప్పడుతుంది. నేనే తీసుకొని వచ్చానని మనీష్ చెప్తాడు. వాడిని తీసుకొని రమ్మని చెప్పింది నేనే అని రత్నం చెప్తుంది. మీ నాన్న పోతూ పోతూ అంజలి బాధ్యత నాకు ఇచ్చాడు.ఇప్పుడు ఆ మాటకి గౌరవం ఇవ్వాలి కదా అని రత్నం అంటుంది. అంజలి ఉంటేనే నేను ఉంటానని రత్నం చెప్తుందిమ తరువాయి భాగంలో అంజలి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు గీతకి కమల ఫోన్ చేసి.. ఎందుకు ఆ అంజలి ఎందుకు రానిచ్చావని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






