Brahmamudi: పన్నెండొందల ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న బ్రహ్మముడి.. టీవీ చరిత్రలో ఇదే మైలురాయి!
Nov 27, 2026 10:48AM
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడి Brahmamudi. ఈ సీరియల్ రేపటితో 1200 ఎపిసోడ్స్ మైలురాయిని చేరుకోబోతోంది. బెంగాలీ సూపర్ హిట్ సీరియల్ గాచ్చోరా Gaatchora కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సీరియల్ 2023 జనవరి 24న మొదలయి టీఆర్పీ లో టాప్ కి చేరింది. ఈ సీరియల్ ఇప్పుడు 1200 ఎపిసోడ్స్ వరకు నిలబడటం అంటే మామూలు విషయం కాదు.
ఈ సీరియల్ కథ విషయానికి వస్తే ముగ్గురు అందమైన, ప్రతిభావంతులైన కుమార్తెలు కావ్య, స్వప్న, అప్పు..వాళ్ళ జీవితాలు దుగ్గిరాల ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ములు రాజ్, రాహుల్, కళ్యాణ్ లను కలిసిన తర్వాత ఎలా మారాయనేది మెయిన్ పాయింట్. రాజ్ గా మానస్ నాగులపల్లి, కావ్యగా దీపికా రంగరాజు లీడ్ రోల్స్ లో నటిస్తూ జంటగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరితో పాటు స్వప్నగా హమీదా ఖాతూన్, రాహుల్ గా శ్రీకర్ కృష్ణ, అప్పుగా నైనిషా రాయ్, కళ్యాణ్ గా కిరణ్ కాంత్, రుద్రాణిగా షర్మిత గౌడ, కనకంగా నీపా శివ తమ పాత్రలతో సీరియల్ కి బలం చేకూర్చారు.
మూడేళ్ల ఈ జర్నీలో బ్రహ్మముడి ఎన్నో ట్విస్ట్ లు, టర్న్ లు చూసింది. కావ్య-రాజ్ ల పెళ్లి, విడిపోవడం, మళ్లీ కలవడం, రాహుల్-స్వప్నల కాపురంలో గొడవలు, రుద్రాణి కుట్రలు, రేఖ, ఐశ్వర్య, రఘువీర్ లాంటి విలన్ల ఎంట్రీతో ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఇటీవల రాజ్, ఇందుల శోభనం గదిలో కరెంట్ షాక్ ప్లాన్, టెండర్ డీల్స్, గురూజీ ప్రాణగండం హెచ్చరిక లాంటి ట్రాక్స్ తో సీరియల్ మరింత హైప్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, భార్యాభర్తల ప్రేమ, అత్తా కోడళ్ల గొడవలు అన్నీ కలిపి ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకుల ఇంటి సీరియల్ అయిపోయింది.1200 ఎపిసోడ్స్ అంటే దాదాపు 4 ఏళ్ల ప్రయాణం. ఈ క్రమంలో బ్రహ్మముడి ఎన్నోసార్లు టాప్ TRP రేటింగ్స్ సాధించింది.డిస్నీ+ హాట్ స్టార్ / జియో హాట్ స్టార్ లో కూడా ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుంటోంది. రేపటి 1200వ ఎపిసోడ్ కోసం మేకర్స్ స్పెషల్ ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్-కావ్యల బంధం మరింత బలపడుతుందా, విలన్ల ఆట కట్టవుతుందా అనేది చూడాలి. మొత్తానికి బ్రహ్మముడి బుల్లితెర చరిత్రలో మరో మైలురాయిని చేరుకుందని చెప్పొచ్చు.




