Home

»

Tv News

Jayam serial : స్నేహను బ్లాక్ మెయిల్ చేసిన ఫ్రెండ్స్.. రౌడీలా మారిన గంగ!

Sep 9, 2026 9:35AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 368 లో... స్నేహ పార్టీకి వెళ్ళినప్పుడు తన ఫోటోస్ తీసుకొని స్నేహను బ్లాక్ మెయిల్ చేస్తారు. అప్పుడే అదంతా గంగ చూస్తుంది. ఏమైందని స్నేహను అడుగుతుంది. దాంతో స్నేహ జరిగింది మొత్తం చెప్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళు స్నేహ అని గంగ చెప్తుంది. స్నేహ ఇంటికి వెళ్తుంది. స్నేహ ఫ్రెండ్స్ ని గంగ కొడుతుంది.

 

అప్పుడే శకుంతల తన ఫ్రెండ్ తో అటుగా వెళ్తుంటే గంగ రౌడీలా కొట్టడం చూస్తుంది. అదేంటి గంగ అలా కొడుతుంది.. అందుకే అలాంటి కుటుంబం నుంచి కోడల్ని తెచ్చుకోవద్దని తన ఫ్రెండ్ అంటుంటే గంగపై శకుంతలకి కోపం వస్తుంది.

 

ఆ తర్వాత శకుంతల కోపంగా ఇంటికి వెళ్తుంది. ఆ మహా తల్లి వల్ల పరువు పోతుంది.. ఆ గంగ రోడ్డుపై అబ్బాయిలని కొడుతుందని శకుంతల చెప్తుంది. అప్పుడే గంగ ఇంటికి వస్తుంది. ఎవరు వాళ్ళు రోడ్డుపై ఎందుకు కొట్టావని తనని కొట్టబోతుంటే అప్పుడే రుద్ర వచ్చి ఆపుతాడు. గంగ కారణం లేకుండా వాళ్ళని కొట్టలేదని అంటాడు. అప్పుడే రంగా ఆ అబ్బాయిలని తీసుకొని వస్తాడు. వీళ్ళు స్నేహ ఫ్రెండ్స్, తన ఫోటోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తుంటే కొట్టిందని రుద్ర చెప్తాడు. సారీ సర్ ఇంకెప్పుడు అలా చెయ్యమని వాళ్ళు అనేసి వెళ్తారు.

 

ఆ తర్వాత చూసావా ఏదీ తెలియకుండా మాట్లాడొద్దని పెద్దసారు అంటాడు. అలా తెలిసినప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా.. తనదే తప్పు అని శకుంతల అంటుంది. ఆ తర్వాత చాలా థాంక్స్ సర్ నాకు సపోర్ట్ చేసినందుకు అని రుద్రకి గంగ చెప్తుంది. అయినా అలాంటివి ఏమైనా ఉంటే నాకు ఫోన్ చెయ్యమని చెప్పాను కదా అని గంగ తన చెవి మెలేస్తాడు రుద్ర. గంగ కిచెన్ లో ఉండగా స్నేహ, రాఘవ, ఇందుమతి వస్తారు. చాలా థాంక్స్ వదిన అని స్నేహ చెప్తుంది. చాలా థాంక్స్ అని ఇందుమతి, రాఘవ అంటారు. స్నేహ నువ్వు మంచిదానివి.. అందరూ నీలాగే ఉంటారు అనుకోవడం పెద్ద తప్పు అని స్నేహతో గంగ అంటుంది. మరుసటి రోజు ప్రీతీని చెక్ చెయ్యడానికి డాక్టర్ వస్తుంది. అంతా బానే ఉందని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com