Home

»

Tv News

Bigg Boss 10 Voting : బిగ్ బాస్ 10 తెలుగు ఫస్ట్ వీక్ ఓటింగ్ లో దూసుకుపోతున్న రోహిత్.. డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు!

Sep 9, 2026 9:42AM

బిగ్ బాస్ ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ హౌస్ మేట్స్ కావాలంటే కొన్ని పరీక్షలు ఎదుర్కోవాలని బిగ్ బాస్ చెప్పాడు. ప్రతి సోమవారం నామినేషన్ ప్రక్రియ ఉంటుంది కానీ ఈ సీజన్ లో నామినేషన్ తో సంబంధం లేకుండా ఉన్న పదహారు మంది నామినేషన్ లో ఉన్నారు. ఈ పదహారు మందిలో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే.

 

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 ఫస్ట్ వీక్ ఓటింగ్ పోల్ భిన్నంగా సాగుతోంది. అనధికారిక ఆన్ లైన్ పోల్ ప్రకారం రోహిత్ 34.84% ఓట్లతో (1,269 ఓట్లు) టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. సెకండ్ ప్లేస్ లో ముకేష్ 10.87% (396 ఓట్లు) తో ఉన్నాడు. రోహిత్ కి మిగతా కంటెస్టెంట్స్ కి మధ్య దాదాపు 24% గ్యాప్ ఉంది. మిడిల్ రేంజ్ లో రామ్ ప్రసాద్ 7.72% (281 ఓట్లు), అమన్ 7.28% (265 ఓట్లు) తో 3, 4 ప్లేస్ లలో ఉన్నారు. దేబ్జాని 4.89%, నరేష్ 4.72%, ఝాన్సీ 4.67%, చరణ్ 4.64%, త్రిగుణ్ 4.34% తో ఒకరి వెనక ఒకరు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. వీరంతా 150-178 ఓట్ల మధ్యలో ఉన్నారు.

 

డేంజర్ జోన్ లో శాలిని 3.16% (115 ఓట్లు), శ్రష్టి 2.72% (99 ఓట్లు), వంశీ 2.2% (80 ఓట్లు), చైత్ర 2.17% (79 ఓట్లు) ఉన్నారు. బాటమ్-3 లో వర్షిణి 2.06% (75 ఓట్లు), కృష్ణుడు 1.98% (72 ఓట్లు), సుధీర్ 1.78% (65 ఓట్లు) తో ఉన్నారు. ఈ లెక్కన ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కి దగ్గరగా సుధీర్, కృష్ణుడు, వర్షిణి ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఎవరు బయటకు వెళ్తారో చూడాలి మరి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com