
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 1132లో.. రేఖ ఓ కొత్త ప్లాన్ వేసింది. రాజుని దెబ్బకొట్టేందుకు లక్కీని తనవైపు తిప్పుకోవాలని చూస్తుంది. లక్కీని మన కొడుకుగా అంగీకరిద్దాం, లక్కీని వాడుకుని రాజుని దెబ్బ కొడదామని రేఖ అంటుంది.ఆస్తి కోసం నేను ఏమైనా చేస్తానని భూషణ్ అంటాడు.
మళ్లీ ప్లాన్ బెడిసి కొట్టింది.. నువ్వు ఎప్పుడూ ఇంతే చేస్తున్నావని రేఖను భ్రమరాంబ తిడుతుంది. సిరికి, రాజుకి ఆల్రెడీ పెళ్లి అయిందనే నిజం కనిపెట్టి రాజుగాడిని ఇంటి నుంచి బయటకు గెంటి ఆస్తి కాజేయొచ్చనుకున్నా కానీ ప్లాన్ చెత్తగా మారిందని భ్రమరం అంటే మనం చేసే పనులే చెత్త కదా అని శేషు అంటాడు. దీంతో రేఖ.. నా దగ్గర మంచి ప్లాన్ ఉంది.. అదే లక్కీతోనే ఆ రాజుగాడిని వెన్నుపోటు పొడిపిస్తానని చెప్తుంది. లక్కీని కొడుకుగా యాక్సెప్ట్ చేసినట్టు నటిద్దామని రేఖ ప్లాన్ చెప్పగానే అందరు షాక్ అవుతారు.
మరోవైపు.. మీరు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు.. ఈ సిరిని ఎప్పుడు చేసుకున్నాడు, వాడి సంగతి చెప్తానని చలపతి అంటే.. అంకుల్, రాజు ఏ తప్పు చేయడు అని ఇందు సపోర్ట్ చేస్తుంది. బావే లోకంగా బావనే పెళ్లి చేసుకుంటా అంటావ్ కదా, ఇదంతా ఎలా భరిస్తున్నావే అని అపర్ణ అడుగుతుంది. నేను బావనే పెళ్లి చేసుకుంటా.. మీరు మీ మనవడిని నమ్ముతున్నారా? అయితే అదే జరుగుతుందని ఇందు ధైర్యంగా అంటుంది. ఇంతలో ఆకలి అంటూ లక్కీ టిఫిన్ అడగ్గా స్వాతి.. నాకు తెలీదు.. ఇందు అక్కకే తెలుసని అంటుంది. వెంటనే రేఖ వచ్చి స్వాతిని తిట్టి ప్రేమగా లక్కీకి టిఫిన్ వడ్డిస్తూ గోరుముద్దలు పెడుతుంది. లక్కీ నా కొడుకు.. లక్కీకి నాన్నగా భూషణ్ ఒప్పుకున్నాడని రేఖ అనగానే థాంక్యూ సర్ అన్న లక్కీతో.. సర్ కాదు నాన్నా అని పిలవమని భూషణ్ అంటాడు. దీంతో లక్కీ సంబరపడగా.. లక్కీ మా పెద్ద కొడుకు అని చెప్పడానికి పార్టీ ఏర్పాటు చేస్తున్నానని రేఖ అంటుంది. ఇదంతా చూసి రాజు.. రేఖ పిన్ని సడెన్ గా ఎందుకు మారింది.. ఏదో తేడాగా ఉందని ఇందుతో రాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






