Jayam serial : గంగ ప్రతిభకు పెద్దసారు ఫిదా.. రుద్ర ఎంట్రీతో జయం లో సరికొత్త ఉత్కంఠ!
Aug 27, 2026 9:26AM
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 357 లో.... గంగని అవమానించాలని శకుంతల వచ్చిన గెస్ట్ ముందు తక్కువ చేసి మాట్లాడుతుంది. దాంతో పెద్దసారు తన గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. అది చూసి శకుంతలకి కోపం వస్తుంది. మా గంగ బాక్సింగ్ ఛాంపియన్.. మా ఇంటి పరువుప్రతిష్టలు పెంచిందని చెప్తాడు. అలా అందరు గంగ గురించి గొప్పగా చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత మా గంగ ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో అంత బాగా చూసుకుంటుందని చాలా గొప్పగా చెప్తుంటే నిజంగా మీరు చెప్తుంటే తన మంచితనం తెలుస్తుంది. మా కోడలికి మీ కోడలిని చూపించి ఇలా ఉండాలమ్మ అని చెప్పాలి. నువ్వు తప్పకుండా పెళ్లికి రావాలని గంగకి వాళ్ళు చెప్తుంటే శకుంతలకి కోపం వస్తుంది.
ఆ తర్వాత అందరు తన పట్ల చూపిస్తున్న ప్రేమకి గంగ ఎమోషనల్ అయి ఏడుస్తుంది. నువ్వు ఇలాంటి పని చేస్తావని తెలిసే నీకు ఇష్టమైన ఫుడ్ తీసుకొని వచ్చాను.. బాగా తిను అని రంగ, పెద్దసారు అంటారు. అదంతా చూసి గంగ ఇష్టంగా తింటుంది. అసలు అమ్మగారు నాతో ప్రేమగా ఉండేవారు ఇలా అయిపోయారని అంటుంది. అప్పుడే రుద్ర వస్తాడు. ఏంటి ఈ తిండి అని కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



.webp)
