Home

»

Tv News

Ye Devi Varamo Neevu:అంజలికి గీత నైటీ.. షాక్ లో గీత!

Aug 27, 2026 9:35AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు.Ye Devi Varamo Neevu. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 47 లో...అందరూ భోజనానికి వస్తారు. అమ్మ ఇంకా రాలేదని అంజలి ఎదురుచూస్తుంది. ఇంతలో గీత వచ్చి అమ్మ ఎక్కడ, తీసుకొని రండి అని చెప్తుంది. దీంతో అంజలి సంతోషంగా రత్నం దగ్గరికి వెళ్తుంది. ఏంటే ఇంత కంగారు అని అంజలిని రత్నం అడుగుతుంది. అమ్మ మిమ్మల్ని తీసుకొని రమ్మని చెప్పిందని అంజలి చెప్తుంది. దానికి రత్నం, ఓహో మీ అమ్మని దగ్గర నుండి చూసుకోవచ్చనా అని రత్నం అంటుంది. అందరు భోజనం చేస్తుండగా గీతకు పొలమారుతుంది. వెంటనే అంజలి వాటర్ ఇస్తుంది. థాంక్స్ అమ్మ అంజలి అని భాను అంటాడు. దీంతో గీత కోపంగా, ఎందుకు నాకు వాటర్ ఇచ్చింది. నాకు ఆ పేరు కానీ తను కానీ కనిపించొద్దని చెప్పాను కదా అని కోప్పడుతుంది. దీంతో అంజలి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

 

ఆ తర్వాత అసలు అక్కడ ఏం జరిగిందని మనీష్ ని రాకీ అడుగుతాడు. అత్తయ్య అంజలిని వద్దని చెప్పి గొడవ చేసింది. కానీ మావయ్య నచ్చజెప్పాడని మనీష్ చెప్తాడు. త్వరలోనే మనల్ని కూడా అక్కడికి షిఫ్ట్ అవ్వమని మావయ్య చెప్పాడని మనీష్ చెప్పగానే రాకీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మళ్ళీ అంజలి దగ్గరికి వెళ్తున్నాను.. తనని సొంతం చేసుకుంటానని రాకీ మనసులో అనుకుంటాడు.ఆ తర్వాత రత్నం, అంజలి మాట్లాడుకుంటారు. రత్నం భవిని పిలిచి అక్కకి ఒక నైటీ ఇవ్వు అంటుంది. అక్క ఏంటి.. అలా పిలవకు అమ్మమ్మ అని భవి అంటుంది.

 

భవి తన రూమ్ లోకి వెళ్లి నైటీ చూస్తుంది. ఇంత కాస్ట్లీవి పనిమనిషికి ఎందుకు అనుకుని, మా అమ్మ రూమ్ లో ఉన్నాయేమో అని గీత రూమ్ కి వెళ్తుంది భవి. తన వెనకాలే అంజలి కూడా వెళ్తుంది. గీతను చూసి అంజలి మురిసిపోతుంది.

అమ్మ ఒక నైటీ కావాలని భవి అనగానే తీసుకో అని గీత చెబుతుంది. దీంతో భవి నైటీ తీసుకొని వెళ్లి అంజలికి ఇస్తుంది. ఇది మా అమ్మ నైటీ అని తెలిసి అంజలి హ్యాపీగా ఫీల్ అవుతుంది.

 

తరువాయి భాగంలో అంజలి గీత నైటీ వేసుకొని ఉండటం చూసి గీత షాక్ అవుతుంది. వెంటనే భవిని పిలిచి ఎందుకు ఇచ్చావని కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com