Home

»

Tv News

Godhavari : నందుకి యాక్సిడెంట్, సూర్యని బ్లాక్ మెయిల్ చేసిన సింహాద్రి!

Aug 27, 2026 9:24AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్   96 లో.. నందుకి నడవలేని పరిస్థితి ఉండటంతో మురళి ఎత్తుకొని ఇంటికి తీసుకొస్తాడు. ఇంట్లో వాళ్ళు ఏమైందని ఆందోళనగా అడుగుతారు. దారిలో చిన్న యాక్సిడెంట్ అయ్యిందని నందు చెప్తుంది. నాకు మొదటి నుంచి ఈ ఊరు నచ్చలేదు. ఎవరూ నా మాట వినడం లేదు. తొందరగా మనం సిటీకి వెళ్దామని నందు అంటుంటే ఇప్పుడు అవన్నీ ఎందుకని ఇంట్లో వాళ్ళు సర్ది చెప్తారు. దాంతో నందు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు.. మగవాడిని ప్రేమతో సొంతం చేసుకోవాలి, పగతో కాద నిత్యకి భువన చెప్తుంది.

 

అప్పుడే సూర్యని తీసుకొని సింహాద్రి వస్తాడు. కార్ డోర్ తీస్తే సూర్య దిగుతాడు. ఏంటి నాన్నా, అతను కార్ డోర్ కూడా తీసుకోలేడా అని నిత్య కోప్పడుతుంది. ఇంటి అల్లుడికి ఆ మాత్రం మర్యాద చేయాలి కదా అని సింహాద్రి అనగానే.. అల్లుడు ఏంటి నాన్నా అని నిత్య అడుగుతుంది. సూర్య పెళ్లికి ఒప్పుకున్నాడని సింహాద్రి చెప్పగానే అందరు సంతోషపడతారు. సూర్య మాత్రం అవునని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఎలా ఒప్పించావ్ అన్నయ్య  అని భువన అడగ్గా.. ఆడపిల్ల తండ్రిని కదా చెల్లెమ్మా, నా బాధ చెప్పాను, ఒప్పుకున్నాడని సింహాద్రి చెప్తాడు.

 

కానీ అసలు ఏం జరిగిందంటే.. సూర్య కళ్ల ముందే నందు, మురళిలకు యాక్సిడెంట్ చేయించబోతాడు సింహాద్రి. నీకు తెలుసు, నీ ముందు జరిగింది కాబట్టి నువ్వు ఆపావు. ఇలా ఆ ఇంట్లో అందరికి జరుగుతుంది. నువ్వు నీ ప్రేమను చంపుకుంటావా, లేకపోతే అందరిని చంపేస్తావా అని సింహాద్రి బ్లాక్ మెయిల్ చేయగానే సూర్య భయపడి పెళ్లికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత సూర్య బెంగళూరు వెళ్లి ఉంటాడు. నాకు అసలు ఫోన్ చేయలేదేంటి, నేనే ఒకసారి ఫోన్ చేస్తానని సూర్యకి జాను ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com