Jayam Serial: వీరు మాస్టర్ ప్లాన్ అదేనా.. జయ పెళ్లికి విశ్వ కండిషన్!
Nov 24, 2026 8:40AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -434 లో.... వీరు డాక్యుమెంట్స్ దొంగతనం చేసి పారిపోతుంటే రుద్ర వాళ్ళు పట్టుకుని మాస్క్ తీసే ప్రయత్నం చేస్తారు. వెంటనే ఇషిక వెళ్లి కరెంట్ ఆఫ్ చేస్తుంది. దానితో వీరు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. మళ్ళీ ఏమీ తెలియనట్లు వెనకాల నుంచి వచ్చి ఏం జరిగిందని అమాయకంగా అడుగుతాడు. దొంగ వచ్చాడు బ్రో అని ఇషిక కవర్ చేస్తుంది. అవునా నేను ఉంటే వాడిని పట్టుకుని కొట్టేవాడిని అని వీరు నటించగా..నువ్వు కంగారు పడకు వీరు వాడిని త్వరలోనే పట్టుకుంటానని రుద్ర అంటాడు. ఆ తర్వాత డాక్యుమెంట్స్ మాత్రం చేతికి వచ్చాయని ఇషికతో వీరు సంతోషంగా అంటాడు. ఇక ఆలస్యం చేయొద్దు వెంటనే లాయర్ దగ్గరికి వెళ్లి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయించి ఆ విజయేంద్ర ప్రతాప్ తో సంతకం పెట్టించి వాళ్ళని గెంటేస్తానని వీరు ప్లాన్ చెప్తాడు. ఆస్తుల్లో నా వాటా నాకు ఇవ్వాలని ఇషిక అడగగానే తప్పకుండా ఇస్తానని వీరు మాట ఇస్తాడు.
మరోవైపు పెద్దసారు రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోతుంటే అప్పుడే కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు. అంతలో పెద్దసారుకి తెలిసిన వ్యక్తి అక్కడికి వచ్చి మాట్లాడతాడు. ఎవరు అతను మీ అబ్బాయి బానునా.. ఎప్పుడో చిన్నప్పుడు చూశానని అనగానే అవునని పెద్దసారు అంటాడు. ఒక్క నిమిషం అని పక్కకు వెళ్తాడు. అప్పుడే ప్రమీల అక్కడికి వస్తుంది. అతను స్వీట్ బాక్స్ తెచ్చి ప్రమీలను చూసి ఆవిడ ఎవరని అడుగుతాడు. ఎవరు మావయ్య అలా అంటున్నారని ప్రమీల అనగానే మావయ్య అంటుందంటే బాను భార్య అయి ఉంటుంది.. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారని అతను అనేసి వెళ్లిపోతాడు. ఎవరు మావయ్య అలా అంటున్నారని ప్రమీల అడగగానే తెలిసిన అతను, తన మాటలు పట్టించుకోకు మీరు మార్ట్కి వెళ్లండి అని వాళ్ళని పెద్దసారు పంపిస్తాడు. వాళ్ళు బైక్ పై వెళ్తుంటే అతను అన్న మాటలు నిజం అయితే బాగుండు అని పెద్దసారు మనసులో అనుకుంటాడు.
మరోవైపు విశ్వ కోపంగా ఇంటికి వచ్చి.. అందరూ మీ అమ్మాయి ఎవరితో తిరుగుతుందంటున్నారని, తనకి ఆటపై ఇంట్రెస్ట్ తగ్గిందని కోప్పడతాడు. అప్పుడే రుద్ర వాళ్ళు వచ్చి ఏంటి మావయ్య రమ్మన్నారని అడుగుతాడు. జయ పోటీలో గెలిస్తేనే వంశీతో పెళ్లి అని విశ్వ కండిషన్ పెడతాడు. దానికి రుద్ర, గంగ సరే అంటారు కానీ జయ మాత్రం డిస్సపాయింట్ అవుతుంది.విశ్వ పెట్టిన ఈ కండిషన్ తో జయ పోటీలో గెలుస్తుందా, వంశీతో పెళ్లి జరుగుతుందా అనేది ఉత్కంఠగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



.webp)
