Akhil Sarthak Emotional Post: ఈసారి నువ్వు లేకుండా నన్ను హ్యాపీగా ఉండనివ్వు.. గత ప్రేమపై సంచలన పోస్ట్!
Nov 24, 2026 8:32AM
.webp)
బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ (Akhil Sarthak) మరోసారి తన పర్సనల్ లైఫ్ తో వార్తల్లో నిలిచాడు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'Dear Past' అంటూ ఒక సుదీర్ఘ భావోద్వేగ లేఖను పోస్ట్ చేశాడు. ఏడాది తర్వాత తన పుట్టినరోజున మాజీ ప్రేయసి నుంచి ఊహించని కాల్ రావడంతో తను చాలా ఆందోళనకు గురయ్యానని అందులో పేర్కొన్నాడు. నీ జీవితంలో ఇప్పుడు వేరే వ్యక్తి ఉన్నారని, వాళ్లతోనే సంతోషంగా ఉండాలని, ఇకపై తనకు విషెస్, కాల్స్, లైఫ్ అప్డేట్స్ చెప్పవద్దని స్పష్టంగా రాశాడు. ఆ కాల్స్ వల్ల తనకు ఆందోళన కలుగుతోందని, ఇది నీ ప్రెజెంట్ పార్టనర్‌కు కూడా ఫెయిర్ కాదని ఘాటుగా స్పందించాడు.
తన మౌనాన్ని ఆహ్వానంగా భావించవద్దని అఖిల్ ఆ లేఖలో ఎమోషనల్‌గా వివరించాడు. ప్రతీసారి నువ్వు కాల్ చేసినప్పుడు నేను సైలెంట్‌గా ఉంటున్నానంటే చెప్పడానికి ఏమీ లేక కాదని, నా మౌనం వెనుక వేల మాటలు ఉన్నాయని అన్నాడు. నా సైలెన్స్ నా తలలో అతిపెద్ద అరుపు అని, నువ్వు వదిలేసిన బంధం నుంచి బయటకు రావడానికి తాను ఎంత కష్టపడ్డానో నీకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. నువ్వే వేరే వ్యక్తి కోసం నన్ను వదిలి వెళ్లావు కాబట్టి ఇప్పుడైనా వాళ్లతోనే ఉండిపోవాలని.. నువ్వు మూసేసిన చాప్టర్‌ను తిరిగి తెరవడానికి రావొద్దని రిక్వెస్ట్ చేశాడు.
తన హీలింగ్‌ను ఆపవద్దని అఖిల్ ఆ పోస్ట్‌లో వేడుకున్నాడు. నీ సాధించిన విజయాలకు నేను నిజంగా సంతోషిస్తున్నానని, కానీ నీ మాటలతో నా హీలింగ్‌ను ఆపవద్దని, ఈ ఏడాది తను జీవితంలో అత్యంత కఠినమైన సంవత్సరాన్ని ఎదుర్కొన్నానని, నువ్వు ఊహించని పోరాటాలు చేశానని చెప్పాడు. నా జీవిత పుటల్లో నీకు చాలా విలువైన స్థానం ఉందని, ఆ జ్ఞాపకాలను చేదుగా మార్చొద్దని, ఎంతో ప్రేమతో నిన్ను దాచుకున్న తన గుండెలోని చిన్న మూలను కూడా కాల్చేయవద్దని ఎమోషనల్ అయ్యాడు. ఒకప్పుడు తను కాల్స్ కోసం ఎదురుచూసి, నువ్వు పట్టించుకోనప్పుడు ఎంత బాధపడ్డానో గుర్తుచేసుకున్నాడు.
చివరగా ఇక ఆ పరిస్థితికి తిరిగి వెళ్లలేనని అఖిల్ తెగేసి చెప్పాడు. నేను నిన్ను ద్వేషించడం లేదు, నీకు చెడు జరగాలని కోరుకోవడం లేదని, కానీ ఎంతో కష్టపడి వదిలేసిన జీవితంలోకి మళ్లీ వెళ్లాలని లేదని అన్నాడు. దయచేసి మళ్లీ తిరిగి రావద్దు, నా మౌనాన్ని ఆహ్వానంగా అర్థం చేసుకోవద్దని, ఇది ఎంతో కష్టపడి సంపాదించుకున్న ప్రశాంతత అని అన్నాడు. Be happy. Stay blessed. I genuinely wish you well. But this time, let me be happy without you అంటూ తన పోస్ట్‌ను ముగించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టాడనే దానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
.webp)



.webp)
