Home

»

Tv News

Jayam serial : వరలక్ష్మి వ్రతం రోజు గంగకి చీర ఇచ్చిన రుద్ర.. జయ గుట్టురట్టు కానుందా!

Sep 4, 2026 11:50AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్  జయం Jayam . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్  364 లో.....జయని తన హాస్టల్ వార్డెన్ చూసి మాట్లాడుతుంది. ఏంటి ఇలా తయారు అయ్యావని ఆవిడ అడుగుతుంది. డబ్బున్న వాళ్ళని పట్టావా అని ఆవిడ అంటుంటే నా గురించి నీకెందుకని జయ పొగరుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత గంగ, వరలక్ష్మి వ్రతం చేస్తుంది. తనకి రుద్ర చీరని ఇస్తాడు. దాంతో గంగ మురిసిపోతుంది.

 

అందరు ఇంట్లో సరదాగా మాట్లాడుకుంటుంటే వ్రతంకి సుధా, జయ వస్తారు. వాళ్ళతో పాటు లక్ష్మి,  పైడిరాజు వస్తారు. మీరు వచ్చారా కిచెన్ లో పనులు చూసుకోండి అని శకుంతల అనగానే శకుంతల ఏం మాట్లాడుతున్నావ్.. వాళ్ళు గంగ పేరెంట్స్.. వాళ్ళకి పనులు చెప్పడం ఏంటని పెద్దసారు కోప్పడుతాడు. నేనేం తప్పు మాట్లాడాను అవన్నీ వాళ్లకి వచ్చిన పనులు అని చెప్పాను అంతే అని శకుంతల అంటుంది. పర్లేదు అండి చేస్తానని లక్ష్మీ అనగానే వాళ్ళకి లేని బాధ మీకెందుకని శకుంతల అంటుంది.

 

ఆ తర్వాత గంగ ఎలాగూ బాక్సింగ్ విషయంలో చేతులు ఎత్తేసింది నువ్వైనా మంచిగా ప్రాక్టీస్ చెయ్ అని జయని శకుంతల ఎంకరేజ్ చేస్తుంది. దాంతో గంగ బాధపడుతుంది. తరువాయి భాగంలో వరలక్ష్మి వ్రతంకి జయ హాస్టల్ మేడమ్ వస్తుంది. జయ గురించి శకుంతల చెప్తుంటే ఆ అమ్మాయి నాకు బాగా తెలుసని ఆవిడ అంటుంది. ఏం అంటావ్ నిషా అని ఆవిడ జయతో అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com