
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు ye Devi Varamo Neevu .గురువారం నాటి ఎపిసోడ్ 55లో అంజలి వంట చేయడానికి మనీష్, బానుని రత్నం ఒప్పిస్తుంది. కానీ అత్తయ్య ఏమంటుందోనని మనీష్ లో భయం మొదలవుతుంది.
ఆ తర్వాత మనీష్ ఆఫీస్ కి వెళ్తుంటే అంజలి వచ్చి ప్లీజ్ నేను కూరగాయలు కొనుక్కొని రావాలి..నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్లమని రిక్వెస్ట్ చేస్తుంది. టైం లేదని మనీష్ అంటే మరి మీ ఇష్టం.. నేను తప్పిపోతే మళ్లీ మీరే వెతకాలని అంజలి అంటుంది. ఎందుకు రిస్క్ అని మనీష్ తనని తీసుకుని మార్కెట్ కి వెళ్తాడు.
నాకొక డౌట్.. నీకు ఎందుకు నానమ్మ అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉందనిపిస్తుంది. నువ్వు చెప్తావా నన్ను తెలుసుకోమంటావా అని మనీష్ అనగానే.. చెప్తాను.. నేను మీ అత్తయ్య ఇంటికి ఓనర్ని.. అది పోయిన జన్మలో, ఇప్పుడు అది గుర్తువచ్చి వచ్చానని అంజలి చెప్తుంది. ఆపు నీ సోది అని మనీష్ అంటాడు. మార్కెట్ కి వెళ్లాక మనీష్ వల్ల అంజలి చెప్పు తెగుతుంది. దీంతో అంజలికి మనీష్ చెప్పులు కొనిస్తాడు. మరోవైపు అంజలి ఇంట్లో ఒక్కతే ఉందనుకుని రాకీ ఇంటికి వస్తాడు. ఇల్లంతా వెతుకుతాడు. మార్కెట్ కి వెళ్లిందని రత్నం చెప్పగానే రాకీ డిస్సపాయింట్ అవుతాడు.
కూరగాయలు కొనుక్కొని అంజలి వాళ్లు రిటర్న్ అవుతారు. ఇంటికి వచ్చాక వెనకాల కూరగాయలు ఉన్నాయి కదా త్వరగా తీసుకో అని మనీష్ అంటాడు. అంజలికి కార్ డిక్కీ తీయడం రాదు.. దీంతో మనీష్ వచ్చి తీస్తాడు. ఆ తర్వాత మళ్లీ మనీష్ వల్లే అంజలి చెప్పు తెగుతుంది. దీంతో మనీష్ వంక అంజలి కోపంగా చూస్తుంది. తరువాయి భాగంలో అందరు భోజనం చేస్తారు. వంటలు బాగున్నాయని గీత అంటుంది. ఇంతకు కొత్త చెఫ్ ఎవరు అని గీత అడుగుతుంది. అప్పుడే అంజలి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
