
అగ్నిపరీక్ష సీజన్ 2 లో బెస్ట్ ఎపిసోడ్ అంటే ఇదేనేమో అన్నట్టుగా నిన్నటి ఎపిసోడ్ 20 సాగింది. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం.. యాంకర్ శ్రీముఖి ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా నేరుగా ఎలిమినేషన్ తోనే స్టార్ట్ చేసింది. ఇది ఇప్పటివరకు ఉన్న ఎపిసోడ్స్ కంటే పూర్తి భిన్నంగా అనిపించింది. సాధారణంగా టాస్క్ పెట్టి ఆ తర్వాత ఎలిమినేషన్ కు వెళ్తారు కానీ ఈసారి మొదట్లోనే డేంజర్ జోన్ లిస్ట్ ను స్టేజ్ మీదకు పిలిచారు. ఎల్లో కార్డ్ వచ్చిన నలుగురు సభ్యులు భాగి, హేమంత్, రామకృష్ణ, అమన్ లను స్టేజ్ మీద నిలబెట్టడంతో హౌస్ లో టెన్షన్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎవరు బయటకు వెళ్తారోననే ఉత్కంఠ అందరిలో కనిపించింది.
అక్కడే జ్యూరీ అసలు అస్త్రాన్ని బయటకు తీసింది. మిగిలిన కంటెస్టెంట్లకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నామని చెప్పింది. డేంజర్ జోన్ లో ఉన్న నలుగురిలో ఎవరో ఒకరిని మీరే మెజార్టీ ఓట్లతో సేవ్ చేయండని ఆదేశించింది. ఇది కంటెస్టెంట్ల మధ్య ఉన్న బాండింగ్ ను, గ్రూప్ పాలిటిక్స్ ను బయటపెట్టే ఛాన్స్ గా మారింది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన వ్యక్తి పేరు చెప్పడం మొదలుపెట్టారు. చివరకు లెక్కపెడితే ఆరుగురు కంటెస్టెంట్లు ఏకంగా అమన్ పేరు చెప్పడంతో అమన్ సేఫ్ అయిపోయాడు. అమన్ ముఖంలో రిలీఫ్ కనిపించినా అది కొన్ని సెకన్లే.
ఎందుకంటే జ్యూరీ వెంటనే రెండో రూల్ చెప్పింది. నువ్వు సేఫ్ అయ్యావు కానీ నీ దగ్గరున్న ఎల్లో బ్యాడ్జ్ ను ఎవరో ఒకరికి ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందేనని కండిషన్ పెట్టింది. ఇది అమన్ కి ఊహించని ట్విస్ట్. ఒకరిని సేవ్ చేస్తే ఇంకొకరు డేంజర్ లోకి రావాల్సిందే అనే పరిస్థితిని జ్యూరీ క్రియేట్ చేసింది. దీంతో అమన్ కు వేరే దారిలేక తన కార్డును చరణ్ కు ఇచ్చేశాడు. చరణ్ కు అసలు ఈ విషయం తెలియదు.. ఒక్కసారిగా తను డేంజర్ జోన్ లోకి వచ్చేసరికి షాక్ అయ్యాడు.
ఈ ఒక్క ట్రాన్స్‌ఫర్ తో ఎపిసోడ్ దిశ మొత్తం మారిపోయింది. మొదట డేంజర్ లో ఉన్న అమన్ బయటపడి అప్పటివరకు సేఫ్ గా ఉన్న చరణ్ లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఫైనల్ డేంజర్ జోన్ లిస్ట్ చరణ్, రామకృష్ణ, హేమంత్, భాగిగా అప్డేట్ అయింది. ఈ నిర్ణయం హౌస్ లో కొత్త గ్రూప్ లు.. కొత్త ఈక్వేషన్స్ కు దారి తీసింది. ఎందుకంటే చరణ్ ఎలిమినేషన్ లోకి రావడం చాలా మందికి ఊహించని పరిణామం. ఇక్కడి నుంచే అసలు టాస్క్ లు మొదలయ్యాయి.




.webp)

