TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Jayam Serial: గంగ ప్రాక్టీస్ బ్యాగ్ లో బాంబ్.. వీరుకి గాయం!

Nov 29, 2026 10:28AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -439 లో... గంగ ప్రాక్టీస్ చేస్తున్న పంచ్ బ్యాగ్ లో ఇషిక, జయ కలిసి బాంబ్ పెడతారు. అది ఐదు పంచ్ లకు బ్లాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తారు. గంగ వచ్చి ప్రాక్టీస్ చేస్తుండగా ఇషిక అకాడమీకి వచ్చి వీరుకి ఫోన్ చేసి గంగపై ఒక ప్లాన్ చేశాను అది నీకు సర్ప్రైజ్ అని చెప్తుంది. దాంతో వీరు త్వరగా అకాడమీకి వస్తాడు. మరోవైపు గంగ పంచింగ్ బ్యాగ్ పై రెండు పంచ్ లు ఇస్తుంది. రాత్రి కరెంట్ షాక్ తగలడం వల్ల నొప్పిగా ఉందని ఆగిపోతుంది.

ఆ తర్వాత వీరు అకాడమీకి వచ్చి ఇషిక దగ్గరికి కాకుండా నేరుగా ప్రాక్టీస్ దగ్గరికి వెళ్లి మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో చూడాలని వచ్చానని అంటాడు. అయినా నీకు ఇవన్నీ తెలియదులే అన్నయ్య అని గంగ అనగా తను కూడా ఫుట్ బాల్ ప్లేయర్ నని వీరు అంటాడు. తను కూడా ఆడగలనని రుద్రతో ఛాలెంజ్ చేస్తాడు. రుద్ర రెండు పంచ్ లు వేస్తాడు. 

వీరు పంచ్ వేయబోతుంటే ఇషిక వచ్చి అవన్నీ మనకి ఎందుకు బ్రో అని వారిస్తుంది. అయినా వినకుండా వీరు పంచ్ వేయగానే బ్లాస్ట్ అవుతుంది. వీరు చేతికి గాయం అవుతుంది. దాంతో ఇషిక వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. అసలు గంగ ప్రాక్టీస్ బ్యాగ్ లో బాంబ్ ఎవరు పెట్టారని రుద్ర, విశ్వ షాక్ అవుతారు. 

వీరు బాంబ్ ఎవరు పెట్టారని తిడుతుంటే బ్రో నేనే పెట్టానని ఇషిక చెప్తుంది. అదేదో నాకు చెప్పాలి కదా అని వీరు కోప్పడతాడు. వీరుకి ఇషిక అసలు ఏం జరిగిందో చెప్తూ ఎందుకు నువ్వు నా దగ్గరికి డైరెక్ట్ రాకుండా అక్కడికి వెళ్లావని అడుగుతుంది. 

ఆ తర్వాత వీరు చేతికి కట్లు కట్టించుకుని వస్తాడు. అందరూ ఏమైందని అడగగా ఇషిక చెప్పబోతుండగా రుద్ర, గంగ వచ్చి జరిగింది చెప్తారు. ఒకరకంగా ఈ రోజు గంగని వీరు కాపాడాడని రుద్ర అంటాడు. 

వీరు గాయం చూసి ఇంట్లో వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు. గంగపై బాంబ్ ప్లాన్ నిజం తెలుస్తుందా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img