TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Bigg Boss 10 Telugu: వర్షిణి, త్రిగుణ్ మధ్య గొడవని‌ దూరం చేసిన నాగార్జున!

Nov 29, 2026 11:01AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 చివరి దశకు చేరుకుంటున్న వేళ హౌస్ లో ఎమోషనల్ డ్రామా పీక్స్ కి చేరింది. హౌస్ లో ప్రస్తుత పరిస్థితి గురించి నాగార్జున కన్ఫెషన్ రూమ్ లో వర్షిణిని ప్రశ్నించగా ఆమె ఎమోషనల్ గా బద్దలైంది. ఇల్లంతా ఒకవైపు, తొమ్మిది మంది ఒకవైపు, తామిద్దరు ఒకవైపు ఉన్నట్లు అనిపిస్తోందని, తమపై గ్యాంగ్ గా ఏర్పడుతున్నారనే ఆవేదన వ్యక్తం చేసింది. సపోర్ట్ రావడం లేదని చెప్పిన వర్షిణి, ఇదంతా క్యారెక్టర్ పాయింట్ దగ్గరే మొదలైందని చెప్పింది.

అసలు గొడవ ఏంటని నాగార్జున అడగ్గా త్రిగుణ్ తనని "చీప్ క్యారెక్టర్ నీది" అంటూ డైరెక్ట్ గా ముఖం మీదే అన్నాడని వర్షిణి కన్నీటితో చెప్పింది. ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ అన్నాడని తన బాధను వెళ్లగక్కింది. ఫ్రెండ్ షిప్ విషయంలో అన్నానని తర్వాత వివరణ ఇచ్చాడా అని నాగార్జున ప్రశ్నించగా, అలాంటి వివరణ ఏమీ ఇవ్వలేదని వర్షిణి సమాధానమిచ్చింది.

వెంటనే బిగ్ బాస్ టీమ్ వీడియో ఫుటేజ్ ప్లే చేయగా అసలు విషయం బయటపడింది. త్రిగుణ్ అన్నది ఫ్రెండ్ షిప్ కి విలువ ఇవ్వని క్యారెక్టర్ అనే అర్థంలో అని, వర్షిణి అడిగిన వెంటనే త్రిగుణ్ ఎక్స్ ప్లెయిన్ కూడా చేశాడని ఫుటేజ్ లో క్లారిటీ వచ్చింది. దీంతో నాగార్జున.. నువ్వు అడిగిన వెంటనే ఎక్స్ ప్లెయిన్ చేశాడు కదా వర్షిణి, నీ మైండ్ లో ఏం రన్ అవుతుందో చూపించారని అనడంతో వర్షిణి షాక్ అయింది. 

ఆ తర్వాత త్రిగుణ్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన నాగార్జున, ఫ్రెండ్ షిప్ కి విలువ ఇవ్వని క్యారెక్టర్ అని నువ్వు వర్షిణి గురించి అనుకున్నట్లే, వర్షిణి కూడా నీ గురించి ఎగ్జాక్ట్ గా అదే అనుకుంటుందని చెప్పాడు. అందువల్ల నీ దగ్గర నుంచి మనస్ఫూర్తిగా అపాలజీ రావాలని కోరాడు. ఈ ఎపిసోడ్ తో వర్షిణి-త్రిగుణ్ మధ్య మిస్ అండర్ స్టాండింగ్ క్లియర్ అయినట్లు అయింది.

 

google-ad-img