Godavari Serial: నందు అమెరికా వెళ్లడానికి ఆకర్ష్ ప్లాన్ .. గౌతమి వెంట అజయ్!
Nov 29, 2026 10:20AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి' (Godavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-176 లో... సంజయ్ ఫోటో చూస్తూ మనల్ని ఎవరు కలుపుతారు కన్నయ్యా అని జయంతి అనుకుంటుండగా జానుకి ఎక్కిళ్లు వచ్చి ఎవరో గట్టిగా తలచుకుంటున్నారని అనుకుంటుంది. ఇక పీఏ అర్జెంట్ సంతకం కోసం, కొడుకు పుట్టినరోజు లీవ్ కోసం రావడంతో జయంతి ఓకే చెప్తుంది.
మరోవైపు నందు బాస్ ఇచ్చిన అమెరికా ఆఫర్ గురించి ఇంట్లో వాళ్లని వదిలి మూడేళ్లు ఉండాలంటే ఏదోలా ఉందని ఆలోచిస్తుండగా అందరూ కంగ్రాట్స్ చెప్తారు, ఆఫీస్ రూల్ ప్రకారం మేనేజర్ చిట్టీలు వేసి తీయమనగా నందు తీసిన చిట్టీలో అమెరికా అని రావడంతో హ్యాపీ అవుతుంది. అసలు నందుకి అమెరికా వెళ్లాలని ఉందని ఆకర్ష్ ముందే మూడు చిట్టీల్లోనూ అమెరికా అని రాయించి డైరెక్ట్ గా చెప్తే ఫీలవుతుందని ఇలా ప్లాన్ చేశానని మేనేజర్ తో చెప్పి అలకనందకి చెప్పొద్దని అంటాడు.
మరోవైపు జాను ఆఫీస్ కి వెళ్లి అందరినీ చలాకీగా విష్ చేసి తను సంజయ్ వైఫ్ అని, ఇక ఆఫీస్ లోనే జాయిన్ అవుతున్నానని చెప్పి కంగ్రాట్స్ చెప్పించుకుని అందరితో మీటింగ్ పెడుతుంది. దోసకాయ పచ్చడి అంటూ జాను మాట్లాడుతుండగా సంజయ్ వచ్చి అందర్నీ పనులు చేసుకోమని పంపిస్తాడు. ఈ ఓవర్ ఏంటి అనగా కాబోయే సీఈవోని నీ క్యాబిన్ లోనే ఓ చైర్ వేయించమని జాను అంటుంది. సంజయ్ జానుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు.
తర్వాత సంజయ్ తనని రోడ్డు మీద వదిలేశాడనే కోపంతో జాను సంజయ్ కోసం తెచ్చిన ఫుడ్ మొత్తం, గడ్డ పెరుగుతో సహా తినేస్తుంది. నువ్వే మొత్తం తినేశావా కనీసం పెరుగు కూడా లేదా అని సంజు అడిగితే నన్ను మధ్యలో దింపేశారు కదా అందుకే ఆకలి వేసి మొత్తం తినేశానని జాను అంటుంది . చూస్తే ఇలా ఉన్నావ్ అంత ఫుడ్ ఎలా తినేశావని సంజయ్ అంటే దట్ ఈజ్ జాను.. శంకర్ నారాయణ కూతురు.. పైగా బీఏ పాస్ అని ఫన్నీగా సమాధానం ఇస్తుంది.
మరోవైపు గౌతమి ఫ్రెండ్ శైలజ కోసం వెయిట్ చేస్తుండగా గౌతమిని కాపాడిన అబ్బాయి అజయ్ వచ్చి హాయ్ అంటూ పక్కన కూర్చుని మాట్లాడబోతాడు. ఏంటి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావని గౌతమి కోప్పడగా నా పేరు అజయ్ అంటూ పరిచయం చేసుకుంటాడు. గౌతమి మాత్రం సీరియస్ గా మాట్లాడుతుంది.
తరువాయి భాగంలో గౌతమి అజయ్ తో మాట్లాడుతుందా, నందు అమెరికా వెళ్లడానికి ఇంట్లో వాళ్లు సంతకాలు పెడతారా, జాను ఆఫీస్ లోనే ఉంటుందా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




