Home

»

Tv News

Bigg Boss 10 : నాగార్జునతో కప్పులు కడిగించిన రోహిత్.. తొమ్మిది సీజన్లలో‌ ఇదే తొలిసారి!

Sep 13, 2026 12:53PM

బిగ్ బాస్ హిస్టరీలోనే ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్-10 లో పాత్రల డ్యూటీపై పెద్ద రచ్చ జరిగింది. గత 9 సీజన్లు చూసిన ఆడియన్స్ కి తెలుసు.. ఎవరి గ్లాస్ వాళ్లే కడుక్కునేవారు, ఎవరి ప్లేట్ వాళ్లే తోముకుని పక్కన పెట్టుకునేవారు. వంట గిన్నెలు మాత్రమే వండిన వాళ్లు క్లీన్ చేసేవారు. కానీ ఈ సీజన్ లో మాత్రం సీన్ మారింది. గిన్నెలు కడిగే డ్యూటీ రోహిత్ ది కాబట్టి ఇంట్లో ఎవరు ఎంగిలి చేసినా అతనే తోమాలని త్రిగుణ్ రూల్ పెట్టాడు.

ఇదే పాయింట్ పై హౌస్ లో పెద్ద గొడవే అయింది. రోహిత్.. నా హ్యాండ్స్ కి క్రీమ్ లేదు, వేరే వాళ్ల ఎంగిలి నేను ఎందుకు కడగాలి అని ప్రశ్నించాడు. దీనికి త్రిగుణ్.. నీ డ్యూటీ గిన్నెలు కడగడం, నువ్వు చేయాల్సిందే అంటూ బలవంతం చేశాడు. ఆడియన్స్ మొత్తం గత సీజన్ల రూల్ నే ఫాలో అవ్వాలని, ఒకరు తాగిన ఎంగిలి గ్లాస్ ని ఇంకొకరు కడగడం ఎక్కడా లేదని రోహిత్ కి సపోర్ట్ చేశారు. కానీ హౌస్ లో మాత్రం త్రిగుణ్ మాటే నెగ్గింది.

రోహిత్ మాట్లాడిన ఆ వీడియోను పెద్ద స్క్రీన్ పై వేశాడు నాగార్జున. హౌస్ మేట్స్ గా ఎంపికైన ముగ్గురికి మిల్క్ షేక్ ఇచ్చి, వాళ్లు తాగిన కప్పులను స్టేజ్ పైకి తెప్పించి.. వాళ్లు ఆటని షేక్ ఆడించినందుకు మిల్క్ షేక్ ఇచ్చాం.. ఇప్పుడు వాళ్లు ఎంగిలి చేసిన గ్లాస్ లను నేను వాష్ చేస్తానని నాగార్జుననే స్వయంగా తన చేతులతో కడిగారు. అంత పెద్ద స్థాయిలో ఉండి నాగార్జున గ్లాస్ లు కడగడం చిన్న విషయం కాదు. బిగ్ బాస్ డైరెక్టర్లు కాన్సెప్ట్ అనుకున్నా దానికి నాగార్జున ఒప్పుకోవడాన్ని మాత్రం అభినందించాల్సిందేనని ఆడియన్స్ అంటున్నారు. ఇక నాగార్జున ‌అలా గ్లాసులు కడుగుతుంటే హౌస్ మేట్స్ అంతా లేచి చప్పట్లు కొట్టారు. 

 

 

 

[Bigg Boss Telugu 10 Rohith glass washing controversy, Nagarjuna washes cups Bigg Boss 10, Trigun vs Rohith vessels duty fight, Bigg Boss 10 weekend episode, Star Maa Bigg Boss Telugu 10 latest news]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com