.webp)
బిగ్ బాస్ హౌస్ లో తొలి వారంలోనే మహా పరీక్ష మొదలైంది. హౌస్ లో ఉన్న పదహారు మంది సభ్యుల్ని రెడ్ అండ్ బ్లూ అని రెండు టీంలుగా విడగొట్టారు. సెలబ్రిటీ వర్సెస్ అగ్నిపరీక్ష బ్యాచ్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా రోహిత్ వర్సెస్ త్రిగుణ్ మధ్య వాదనలు పీక్స్ కి వెళ్లాయి. మొదటి వారంలోనే బిగ్ బాస్ పదహారు మందిని నామినేషన్ లోకి నెట్టడంతో ఓటింగ్ వార్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అందరి క్రేజ్ పైనే ఓట్లు ఆధారపడ్డాయి. ఇంతలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ బాంబ్ పేల్చారు బిగ్ బాస్. హౌస్ లో ఉండటానికి అనర్హులైన ఇద్దరిని ఎంపిక చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. రెడ్ టీమ్ నుంచి అగ్నిపరీక్ష బ్యాచ్ అంతా కలిసి చరణ్ ని హై రిస్క్ లో పెట్టారు. రోహిత్ చరణ్ గేమ్ సీరియస్ గా ఆడటం లేదని కారణం చెప్పాడు. బ్లూ టీమ్ నుంచి నాయకుడు రాంప్రసాద్ తనంతట తనే హై రిస్క్ కి వచ్చాడు.
హై రిస్క్ అంటే ఏ క్షణంలోనైనా ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఉందని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు. దీంతో చరణ్ మిడ్ వీక్ లో ఎలిమినేట్ అవ్వడం ఖాయమైంది. ఎందుకంటే రాంప్రసాద్ దగ్గర స్పెషల్ పవర్ ఉండటంతో అతను గండం నుంచి గట్టెక్కే అవకాశం ఉంది.అగ్నిపరీక్షలో రోహిత్ కంటే ముందు చరణ్ బాగా మెప్పించినా, చివర్లో రోహిత్ పుంజుకుని హౌస్ లోకి వచ్చాడు. రోహిత్ వచ్చిన తర్వాత యాటిట్యూడ్ పెరిగిందని చరణ్ ని తెలివిగా గేమ్ నుంచి తప్పించేందుకే హై రిస్క్ లో పెట్టాడనే వాదన వినిపిస్తోంది.
మొత్తానికి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో చరణ్ బలి కాగా.. హౌస్ లో ఇప్పుడు 15 మంది మిగిలారు. వీకెండ్ లో మరో ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది నాగార్జున క్లారిటీ ఇవ్వనున్నారు.





.webp)
