Home

»

Tv News

యూసఫ్ మాష్టర్ తల్లికి ట్రీట్మెంట్ చేయించిన జానీ మాష్టర్

Sep 22, 2026 9:56AM

ఢీ 20 సీజన్స్ పూర్తి చేసుకుని 21 వ సీజన్ లో ఎంట్రీ ఇచ్చింది. ఢీ డబుల్ ఇంపాక్ట్ పేరుతో ఈ సీజన్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ వారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ని కొరియోగ్రాఫర్స్ ఎంచుకున్నారు. అందులో యూసఫ్ మాష్టర్ కూడా కొంతమంది కంటెస్టెంట్స్ ని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో జడ్జ్ గా వచ్చిన జానీ మాష్టర్ యూసఫ్ మాష్టర్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.

"యూసఫ్ మాష్టర్ ఆరేడు నెలల క్రితం నాకు ఫోన్ చేసి అన్నా నేను ఎంత ప్రయత్నించినా నాకు ఎక్కడా అవకాశాలు రావట్లేదు. నా టాలెంట్ గుర్తించట్లేదు. నేను ఫైనాన్సియల్ గా కూడా బాగా వీక్ ఐపోయాను. నేను డాన్సర్ కార్డుకి రిజైన్ చేసేసి వెళ్లిపోవాలని అనుకుంటున్నాను. నాకు కార్డు రిటైర్మెంట్ ఇస్తారా అని అడిగాడు. రిటైర్మెంట్ తీసుకుని ఎం చేస్తావ్ అని అడిగాను. అంటే  మళ్ళీ డబ్బులు సంపాదించి కార్డు తీసుకుని కొరియోగ్రాఫర్ అవుతావా. ఒక్కసారి వదిలేసి వెళ్లిపోయిన తర్వాత కొరియోగ్రాఫర్ కావడం మళ్ళీ కష్టం కాబట్టి వెయిట్ చెయ్యి కచ్చితంగా నీకు ఎదో ఒక మంచి ప్లాట్ఫారం దొరుకుతుంది అని చెప్పాను. ఆ రోజు నువ్వు కార్డుకి రిజైన్ చేసి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నీకు ఈ ప్లాటుఫారం దొరికేదా " అని అడిగారు జానీ మాష్టర్ .

వెంటనే యూసఫ్ మాష్టర్ ఆన్సర్ ఇచ్చారు. "దొరికేది కాదు మాష్టర్ ఆ డెసిషన్ అలా ఎందుకు తీసుకుందామనుకున్నానంటే నాకు ఏమీ అర్ధం కాక డాన్స్ వద్దు అనుకున్నా. నాకు ఉన్నది అమ్మ ఒక్కటే ఎం చేయాలో తెలీలేదు. ఫైనాన్సియల్ గా టైట్ ఐపోయాను. అప్పుడు అన్న నాకు చెప్పారు టెన్షన్ పెట్టుకోకు నేను చెప్తాను గ్రూప్ లో పెట్టుకో అమ్మకు ట్రీట్మెంట్ అయ్యేలా చేశారు. " అని చెప్పాడు.

"దాని కోసం కొంచెం వెయిట్ చేయాలి అంతే. ఆ వెయిట్ చేసినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు నువ్వెంటో నిరూపించుకోవాలి. నువ్వు పడిన కష్టాలకు దేవుడు నీకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చాడు. నీ టాలెంట్ నిరూపించుకుని ఢీ ద్వారా మంచి మంచి సాంగ్స్ చేసి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళడానికి ఒక మంచి ఛాన్స్ వచ్చింది. అక్కడి వరకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ విషెస్ చెప్పారు జానీ మాష్టర్.

 

 

 

[Dhee 21 Double Impact, Dhee 21, Jani Master, Yusuf Master, Dhee 21 Promo, Telugu Dance Show, Dhee Dance Show, Dance Choreographers, ETV Dhee, Yusuf Master Story]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com