.webp)
బుల్లితెర నెంబర్ వన్ డాన్స్ రియాలిటీ షో ఢీ -21 రీసెంట్ ప్రోమో వచ్చేసింది. ఈసారి సీజన్ టైటిల్ ని.. డబుల్ ఇంపాక్ట్ అని పెట్టారు. DOUBLE the energy, DOUBLE the entertainment and DOUBLE the impact అంటూ ఈటీవీ విన్ రిలీజ్ చేసిన ప్రోమోలో హై వోల్టేజ్ డాన్స్ బాటిల్స్, భారీ పర్ఫామెన్స్ లు చూపించారు. లాంగ్ గ్యాప్ తర్వాత యాంకర్ ప్రదీప్ మాచిరాజు మళ్లీ ఢీ స్టేజ్ పైకి వస్తున్నాడు. ఇదే ప్రోమోలో హైలైట్. ప్రోమో స్టార్టింగ్ లోనే ప్రదీప్ మార్క్ ఎనర్జీ, పంచ్ లు కనిపించాయి. ఈ సీజన్ కి జడ్జిలుగా ఇద్దరు కన్ఫమ్ అయ్యారు. ఒకరు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, మరొకరు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఫస్ట్ టీవీ షో జడ్జ్ గా చేస్తోంది అనుపమ. ప్రోమోలో అనుపమ, ప్రదీప్ మధ్య ఫన్నీ డైలాగ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని ప్రదీప్ అడిగితే.. అప్పుడే ఫ్లర్ట్ చేస్తావా అంటూ మైక్ తో సరదాగా కొడుతుంది.
ఇక ఈసారి ఢీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఓటీటీలో బిగ్ డీల్ జరిగింది. సాధారణంగా ఢీ షోలు కేవలం ఈటీవీ విన్ లో మాత్రమే వచ్చేవి.. కానీ ఢీ 21 డబుల్ ఇంపాక్ట్ ని గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కూడా స్ట్రీమింగ్ హక్కులు తీసుకుంది. ఇది తెలుగు బుల్లితెర నాన్-ఫిక్షన్ షోలకు మైలురాయిగా చెప్తున్నారు. ఓజీ కొరియోగ్రాఫర్లు యశ్వంత్, జేడీ, లక్ష్మణ్, సునీల్, గోవింద్, రేవంత్, యూసుఫ్, జిత్తు తదితరులు ఈ సీజన్ లో పోరుకు సై అంటున్నారు. ఢీ-21 డబుల్ ఇంపాక్ట్ సెప్టెంబర్ 19 నుంచి ప్రతి వారం రాత్రి 9:21 గంటలకు ప్రసారం కానుంది. ఈటీవీ విన్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగా చూడొచ్చు. అలాగే నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుబాటులోకి రానుంది. విన్ ఒరిజినల్ షోగా వస్తున్న ఈ సీజన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రదీప్ యాంకరింగ్, అనుపమ గ్లామర్, జానీ మాస్టర్ జడ్జిమెంట్ తో ఈసారి డబుల్ ఇంపాక్ట్ పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.
[Dhee 21 Double Impact, Dhee 21, Pradeep Machiraju, Anupama Parameswaran, Jani Master, Netflix, ETV Win, Dhee 21 Promo, Telugu Dance Reality Show, Dhee 21 Streaming]




.webp)
.webp)
