Home

»

Tv News

Bigg Boss Telugu 10 Actor Krishnudu Remuneration: యాక్టర్ కృష్ణుడు రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Sep 21, 2026 10:14AM

బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు అప్పుడే రెండు వారాలు పూర్తిచేసుకుంది. మొదటివారం చైత్ర ఎలిమినేషన్ అవ్వగా రెండో వారం కృష్ణుడు ఎలిమినేషన్ అయ్యాడు. కృష్టుడు హౌస్ లో మొదటి వారం ఎక్కువగా కనిపించగా రెండో వారం చాలా తక్కువగా కనిపించాడు. దాంతో అతను ఆడియన్ లాగా చూస్తూ కూర్చున్నాడు కానీ యాక్టివ్ పర్ఫామెన్స్ లేదని నాగార్జున అన్నాడు.

 

యాక్టర్ కృష్ణుడు మిస్టర్ పర్ఫెక్ట్, హ్యాపీడేస్, ఓయ్, వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2008 లో వినాయకుడు అనే సినిమాలో హీరోగా నటించగా, 2009 లో దానికి సీక్వెల్ గా విలేజ్ లో వినాయకుడు సినిమాలో నటించారు. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు వేసి మెప్పించారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

హౌస్ లో తన సెకెండ్ సైడ్ చూపిస్తానని వచ్చిన కృష్ణుడు పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయాడు. ఒక్క రోహిత్ ని నామినేషన్ చేసినప్పుడు తప్పా ఇంకా ఎప్పుడూ పెద్దగా కనపడలేదు. అయితే ఈ బిగ్ బాస్ హౌస్ అతనికి చాలా మెమోరీస్ ఇచ్చిందని బయటకి వచ్చేముందు చెప్పాడు.‌ హౌస్ లో మొత్తంగా రెండు వారాలున్నాడు కృష్టుడు. అతనికి భారీగానే రెమ్యునరేషన్ అందినట్లు సమాచారం. వారానికి సుమారు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు పారితోషికం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే హౌజ్ లో రెండు వారాలు కొనసాగితే సుమారు రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు రెమ్యూనరేషన్ కృష్ణుడికి అంది ఉంటుందని టాక్ వినపడుతోంది. మరి హౌస్ లో నుండి కృష్ణుడి ఎలిమినేషన్ అనేది అన్ ఫెయిరా ఫెయిరా కామెంట్ చేయండి.

 

 

 

[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Krishnaudu, Krishnaudu Elimination, Bigg Boss Telugu Elimination, Mr Perfect, Happy Days, Vinayakudu, Village Lo Vinayakudu, Krishnaudu Remuneration]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com