.webp)
స్టార్ మా టీవీలో కొత్తగా మొదలైన సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ పల్లెటూరులో జరిగే వాస్తవాలని కళ్ళకి కట్టినట్లు చిత్రకరించారు. ఇందులో సీనియర్ నటుడు రాజా రవీంద్ర మెయిన్ లీడ్ లో నటించాడు. అసలు కథ ఏంటో ఓ సారి చూసేద్దాం..
కోనసీమలో ఒక పల్లెటూరు. అందులో ఒక చిన్న ఇంట్లో శంకర్ నారాయణ (రాజ రవీంద్ర) ఇంటి పెద్ద. అతనికి భార్య, నలుగురు కూతుళ్లున్నారు. వాళ్ళని ఏ లోటు లేకుండా పెంచడానికి దుబాయ్ వెళ్లి కష్టపడతాడు. తన భార్యకి రేపు దుబాయ్ నుండి ఇంటికి వస్తున్నానని ఫోన్ చేస్తాడు. దాంతో కుటుంబం మొత్తం సంతోషపడుతారు. పెద్దకూతురు అలకనంద, రెండో కూతురు జాహ్నవి.. మూడో కూతురు గౌతమి.. చిన్న కూతురు కిన్నెరా.. నా కొడుకు వచ్చాక అలకనందకి పెళ్లి చెయ్యాలని వాళ్ళ నానమ్మ అంటుంది. నేను బావని పెళ్లి చేసుకోను.. మెషిన్ కుట్టేవాడిని చేసుకోను.. NRI సంబంధం చూడమని నాన్నకి చెప్తానని అలకనంద అనుకుంటుంది. మరొకవైపు అలకనందను ఉహించుకుంటూ మురళి మెషిన్ కుడుతాడు. అప్పుడే వాళ్ళ అమ్మ వస్తుంది. శంకర్ ఫోన్ చేసి రేపు వస్తున్నానని చెప్తాడు. తమ్ముడు వచ్చాక అలకనందని నీకు ఇచ్చి పెళ్లి చెయ్యమని అడుగుతానని మురళి వాళ్ళ అమ్మ అనుకుంటుంది. ఆ తర్వాత కథనాయిక జాహ్నవి (జానూ) ఊళ్ళో కోనసీమ అందాలను ఎక్స్ ప్లెయిన్ చేసే గైడ్ టూరిస్ట్ లకి కోనసీమలో ఉండే ప్రత్యేకతలు చెప్తుంది. జానూకి తన ఫ్రెండ్స్ కలుస్తారు. మీ నాన్న దుబాయ్ లో మీ కోసం కష్టపడుతున్నాడు.. నువ్వు ఇక్కడ గైడ్ గా చెయ్యడం అవసరమా అంటారు. మా నాన్నకి కాస్త తోడుగా ఉండాలని అంతే అందరు ఆడపిల్ల లేనా అని చాలా మంది అన్నారు.. ఆడపిల్ల నాన్నకి ఆసరా ఉండలేదా... ఎప్పటికైనా నేను సొంతంగా టూరిస్ట్ బోర్డ్ కొంటాను.. మా నాన్నని బాగా చూసుకుంటానని జానూ తన ఫ్రెండ్స్ కి చెప్తుంది. అప్పుడే కథానాయకుడు సూర్య. అక్కడ వ్యూ ని ఎంజాయ్ చేస్తూ వీడియో తీస్తుంటే జానూ కన్పిస్తుంది. తనని మొదటి చూపులోనే చూసి ఫ్లాట్ అవుతాడు. తన దగ్గరికి వెళ్లి మాట కలిపి టూరిస్ట్ బోర్డు ఎక్కుతాడు. అక్కడ జానూకి తెలిసిన వాళ్ళు ఎవరో రేపు మీ నాన్న వస్తున్నాడట అనగానే పరుగులు ఇంటికి బయల్దేరుతుంది. దారిలో కొంతమంది కళ్ళకి గంతలు కట్టుకొని, కర్రసాము చేస్తూ కన్పిస్తారు. వాళ్ళని చూసి ఎందుకు అలా చేస్తున్నారని అడుగుతుంది. రేపు ఉత్సవాలు కదా ఇందులో గెల్చిన వాళ్ళకి ఆంజనేయ స్వామికి అభిషేకం చేసే అవకాశం వస్తుందని వాళ్ళు చెప్తారు. అయితే నేను ఆడుతానని జానూ వాళ్ళకి చెప్తుంది. రేపు మా నాన్నతో అభిషేకం చేయించి సర్ ప్రైజ్ ఇవ్వాలని జానూ అనుకుంటుంది.
ఆ తర్వాత శంకర్ వస్తున్నాడని తన భార్య పిండివంటలు చేస్తుంది. అలకనంద షర్ట్ కుడుతుంది. గౌతమ్ గ్రాంఢ్ గా ఇంటి ముందు వెల్ కమ్ అని పూలతో డెకరేషన్ చేస్తుంది. కిన్నెరా వాళ్ళ నాన్న ఫోటో డ్రాయింగ్ వేస్తుంది. ఆ తర్వాత జానూ ఇంటికి వస్తుంది. ఎందుకే మగారాయుడిలాగా తిరుగుతావని వాళ్ళ అమ్మ కోప్పడుతుంది. అందరు మీ నాన్న కోసం ఏదో ఒకటి సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.. నువ్వు ఏం చేసావని వాళ్ళ అమ్మ అడుగుతుంది. అది సర్ ప్రైజ్ అని జానూ చెప్తుంది. మరుసటిరోజు శంకర్ ఇంటికి వస్తాడు. తన కూతుళ్ళని పట్టుకొని ఎమోషనల్ అవుతాడు. అవును జానూ ఎక్కడ అని అడుగుతాడు. మరోవైపు జానూ కర్రసాము పోటీలో ఉంటుంది. జానూ ఆంజనేయస్వామికి అభిషేకం చేయించి దుబాయ్ నుండి వచ్చిన వాళ్ళ నాన్నకి సర్ ప్రైజ్ ఇస్తుందో లేదో చూడాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
