
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో Day 12 లో.. కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. రామ్ ప్రసాద్, ఝాన్సీ ల మధ్య సాగిన తుది టాస్క్ లో ఝన్సీ గెలిచి హౌస్ లో ఫస్ట్ కెప్టెన్ అయింది. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ లో షాలిని-వర్షిణి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఆ తర్వాత త్రిగుణ్-ముఖేష్ ల మధ్య పెద్ద గొడవ జరిగింది.
ఈ కెప్టెన్సీ టాస్క్ ముందు హౌస్ లో రామ్ ప్రసాద్, నరేశ్, రోహిత్, టెంపర్ వంశీ, అమన్ కలిసి ఛత్రపతి స్కిట్ చేశారు. ఆ స్కిట్ కి హౌస్ లోని వాళ్ళంతా ఫుల్ గా నవ్వేశారు. కాట్ రాజ్ గా నరేశ్ చేయగా ప్రభాస్ గా టెంపర్ వంశీ, పిల్లాడి పాత్రలో అటో రామ్ ప్రసాద్ చేశాడు. ఒరేయ్ సూరీడు.. ఏడికిరా అని నరేశ్ అనగానే మా అమ్మ దగ్గరికి సర్ అని రామ్ ప్రసాద్ అంటాడు. మరి నా కాళ్లు ఎవరు నొక్కుతారురా అని నరేశ్ అనగనే టెంపర్ వంశీ వచ్చి కాళ్ళు పట్టుకోగానే ఇక చాలు.. నువ్వు వెళ్ళొచ్చని కాట్ రాజ్(నరేశ్) అంటాడు. ఇక కాసేపటికి ఏరా ఎక్కడికి రా.. నిన్న వెళ్ళిపోమన్నారుగా అని రామ్ ప్రసాద్ అనగానే అది నిన్నరా అని నరేశ్ అంటాడు. దాంతో నరేశ్ చేతిని కొరికి రామ్ ప్రసాద్ పారిపోతుంటే నరేశ్ కొడతాడు. దాంతో రామ్ ప్రసాద్ పడిపోతాడు.
ఇక రామ్ ప్రసాద్ చుట్టూ గీత గీసి.. ఈ గీత దాటి ఎవడైనా వస్తే చంపేస్తా అని నరేశ్ వార్నింగ్ ఇవ్వగానే టెంపర్ వంశీ కోపంతో చూస్తాడు.ఇక అమన్ అతడిని ఆపే ప్రయత్నం చేయగా..ఇక చాలు అని వంశీ అంటాడు. దాంతో అమన్ భయపడి అక్కడి నుండి వెనక్కి వెళతాడు. ఇక వంశీ, నరేశ్ మధ్య ఫైట్ సీక్వెన్స్ తో అందరు కడుపుబ్బా నవ్వుకున్నారు. నరేశ్ ని గాల్లోకి లేపుతాడు వంశీ. అయినా అతడిని నరేశ్ కొడతాడు. ఇక స్కిట్ అంతా ముగిసాక అందరు ఫుల్ గా నవ్వుకుంటారు. స్కిట్ బాగుందని బిగ్ బాస్ అంటాడు. కాట్ రాజ్ కండలు కాస్త ఎక్కువైనట్టున్నాయి.. సూరీడు మరీ పసివాడు అయినట్టుగా అనిపిస్తుందని బిగ్ బాస్ అనడంతో అందరు ఫుల్ గా నవ్వుకున్నారు. ఇది ది బెస్ట్ స్కిట్ గా నిలిచింది.
[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Ram Prasad, Naresh, Rohith, Temper Vamsi, Aman, Chhatrapati Skit, Captaincy Task, Jhansi]




.webp)

