
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-377 లో.. హాల్లో వంశీ, రాఘవలతో పాటు మిగిలిన కుటుంబ సభ్యలంతా కలిసి వీరు-ప్రీతీలకి పుట్టిన బాబుకి ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తుంటే అప్పుడే శకుంతల వచ్చి.. ముందు బాబుకి జాతకం రాపించాలి.. ఆ తర్వాత ఏ అక్షరం వస్తుందో చూసి పేరు చూడాలని శకుంతల అనగానే సరేనని మిగతా వారంటారు. అప్పుడే ప్రీతి, వీరు బాబుతో వస్తారు. ప్రీతి దగ్గర నుండి శకుంతల బాబుని తోసుకొని గారాభాం చేస్తూ ఆడుకుంటుంది.
ఇక వీరు ఏదో చెప్పబోతూ ఉంటే అప్పుడే మేడమీద నుండి రంగా, గంగ, రుద్రలు సూట్ కేసులతో పాటు దిగుతారు. వాళ్ళని చూసిన పెద్దసారు.. ఏంటి రుద్ర ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారు. రంగాని దుబాయ్ కి పంపించాడానికి వెళ్తున్నారా అని ఇషిక వాళ్ళ అత్తయ్య అంటుంది. లేదు పెద్దనాన్న.. ఇంట్లో నుండి వెళ్ళిపోదామని డిసైడ్ అయి వెళ్ళిపోతున్నామని రుద్ర అనగానే అందరు షాక్ అవుతారు. ఎందుకని పెద్దసారు అడుగుతాడు. వీరు నేరం చేశాడని నాకు తెలిసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళాను. కానీ అతను డౌట్ తో , నా మీద కోపంతో ఉంటాడు. మేమిద్దరం ఎదురెదురుగా ఉండలేమంటూ రుద్ర అనగానే అదేం పర్లేదు.. రుద్ర ఏం అనుకోడు.. అని పెద్దసారు, శకుంతల అంటారు. ఇక వీరు ప్లాన్ ఫెయిల్ అయినట్టే.. అంటే..ఇంట్లో నుండి వెళ్ళాలనుకుంటున్నట్టు అందరి ముందు యాక్ట్ చేసి సింపథీ కొట్టేయాలని, రుద్రని అందరు తిట్టుకోవాలని వీరు అనుకుంటాడు. అలా రుద్ర మీద రివేంజ్ తీసుకుందామని వీరు అనుకుంటాడు కానీ రుద్ర అతడి కంటే ముందే ఒక స్టెప్ ఆలోచించి వీరు ప్లాన్ ని ఫెయిల్ చేస్తాడు.
ఇక అందరు వెళ్లిపోయాక వీరు, రుద్ర మాట్లాడుకుంటారు. ఏంటి వీరు ప్లాన్ ఫెయిల్ అయిందా అని రుద్ర అడుగుతాడు. ఇప్పుడు తప్పించుకున్నావ్ .. ఇకముందు నా నుండి తప్పించుకోలేవని వీరు అంటాడు. ప్రీతీ మాటల్లో నాకొకటి అర్థం అయింది. నువ్వు నేరం చేశావని తనకి తెలిస్తే ఈ ఇంట్లో నుండి తనే నిన్ను గెంటేస్తుంది.. దట్ ఈజ్ మై సిస్టర్ అని రుద్ర గొప్పగా చెప్తాడు. దాంతో వీరు షాక్ అవుతాడు. నిన్ను ఆధారాలతో సహా చట్టం ముందు నిలబెడతానని రుద్ర వార్నింగ్ ఇచ్చి వెళతాడు. అయ్యో రుద్ర.. కోమాలో ఉన్నవాడిని చంపించేసి అసలు సాక్ష్యాలే లేకుండా చేస్తానని వీరు తన మనసులో అనుకుంటాడు. అప్పుడే వీరు(అతని) దగ్గరికి రంగా, గంగ వస్తారు. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అని పాట పాడుతాడు రంగా. దాంతో వీరు కోపంగా వాళ్ళ వంక చూస్తాడు. ఇక గంగ, రంగా ఇద్దరు వీరుని ఇష్టమొచ్చినట్టుగా ఇండైరెక్ట్ గా తిడతారు.
[Jayam, Jayam Episode 377, Zee Telugu Serial, Veeru, Preethi, Rudra, Ganga, Ranga, Shakuntala, Ishika, Telugu Serial]





