.webp)
బిగ్ బాస్ తెలుగు 10 లో డే 12 ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఇందులో ముఖేష్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అగ్నిపరీక్ష బ్యాచ్ వర్సెస్ సెలబ్రిటీస్ గ్రూప్ గా హౌస్ విడిపోయిన వేళ, త్రిగుణ్ ముఖేష్ ని టార్గెట్ చేశాడు. త్రిగుణ్ ఫ్యామిలీ షో అది ఇదీ అంటూ తను సినిమాల్లో చేస్తున్నానని మేం అంతా ఏదో చేస్తున్నాం అంటున్నాడు.. నన్ను నక్క అంటున్నాడంటూ ముఖేష్ దేబ్జానీ, రామ్ ప్రసాద్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. నక్కలాగా దాక్కోవడం కాదంటూ ముఖేష్ ని త్రిగుణ్ అన్నాడు. అలాగే ఆడవాళ్లని పావురాలు అని త్రిగుణ్ అన్నాడంటూ వర్షిణి, ఝాన్సీ మాట్లాడుకున్నారు. త్రిగుణ్ మంచిగా మాట్లాడటం లేదని ముఖేష్ బాధపడ్డాడు.
కెప్టెన్సీ టాస్క్ 'చిక్కకు దొరకకు' లో భాగంగా కంటెండర్లు జైలులో ఉంటే మిగతా వాళ్లు కానిస్టేబుల్స్ గా ఆపాలి. ఈ టాస్క్ లో త్రిగుణ్ ని ఆపే ప్రయత్నంలో అతని మెడ పట్టుకున్నాడు ముఖేష్. త్రిగుణ్ టీషర్ట్ కూడా చిరిగిపోయింది. ఫిజికల్ అయినందుకు త్రిగుణ్ ముఖేష్ పై ఫైర్ అయ్యాడు. రోహిత్ గార్డ్ గా ఉండి త్రిగుణ్ ని దారుణంగా ఆపేస్తాడు. ముఖేష్ తో పాటు వర్షిణి, చరణ్ కలిసి త్రిగుణ్ ని గోడ దూకకుండా అడ్డుకోవడంతో హౌస్ లో టెన్షన్ పీక్స్ కి వెళ్లింది.
కెప్టెన్సీ టాస్క్ ముగుస్తుందనే క్రమంలో .. రామ్ ప్రసాద్, ఝాన్సీ, త్రిగుణ్ జైలులో ఉంటే అందరు త్రిగుణ్ ని టార్గెట్ చేయడం అతను తీసుకోలేకపోయాడు. అయితే వర్షిణి, చరణ్ లని ఏం అనకుండా ఒక్క ముఖేష్ నే త్రిగుణ్ అలా అనడం కరెక్ట్ కాదని నెటిజన్లు భావిస్తున్నారు.
ముఖేష్, త్రిగుణ్ ఇద్దరి మధ్య గొడవనే నెక్స్ట్ నామినేషన్స్ కి లీడ్ అయ్యేలా కనిపిస్తోంది
[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Mukesh Gowda, Trigun, Captaincy Task, Chikkaku Dorakaku Task, Rohith, Varshini, Charan, Debjani].




(2).webp)

