బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లోకి ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్ లలో నరేశ్ ఒకడు. ఎంతోమంది కొత్త కంటెస్టెంట్స్ తో గ్రాంఢ్ ప్రీమియర్ కి రెడీ అవబోతున్న తరుణంలో ఈ ట్విస్ట్ మాములుగా లేదుగా.. అయితే ఒక జోనర్ నుండి ఒకరినే తీసుకుంటారు హౌస్ లోకి. ఈ సారి మాత్రం కామెడీ కోసం ఇద్దరిని తీసుకొస్తున్నారనేది కన్ఫమ్ అయింది. అసలు విషయం ఏంటంటే.. జబర్దస్త్ స్టార్ నరేష్ హౌస్ లోకి వెళ్తున్నాడని కన్ఫమ్ అయింది. ఇప్పటికే ఆటో రామ్ ప్రసాద్ హౌస్ లోకి వెళ్తున్నాడని కన్ఫమ్ అవ్వగా, అతనితో పాటు జబర్దస్త్ నరేష్ కూడా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడనేది ఎక్కువగా వినపడుతోంది.సెప్టెంబర్ 6న జరగబోయే గ్రాండ్ ప్రీమియర్ లో నాగార్జున చేతుల మీదుగా 10 మంది సెలబ్రిటీలు లోపలికి వెళ్తారు. వారిలో ఒకరిగా నరేష్ ఎంట్రీ కన్ఫమ్ అయింది. ఈ సీజన్ లో ఇద్దరు జబర్దస్త్ కమెడియన్లు ఉండడంతో కామెడీకి కొదవ ఉండదు.
జబర్దస్త్ నరేష్ ఎవరంటే బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్. జబర్దస్త్ లో తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాకెట్ రాఘవ, చమ్మక్ చంద్ర టీమ్స్ లో చేస్తూ తన కామెడీతో ఆకట్టుకుంటున్నాడు. చాలా ఏళ్లుగా జబర్దస్త్ లో చేస్తున్న నరేష్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టేజ్ పై ఎంత ఫన్నీగా ఉంటాడో, బయట కూడా అంతే సింపుల్ గా ఉంటాడు.
బిగ్ బాస్ హౌస్ లో నరేష్ గేమ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్. గత సీజన్లలో జబర్దస్త్ నుండి వచ్చిన అవినాష్, ఇమ్మాన్యుయేల్, ఫైమా లాంటి వాళ్ళు హౌస్ లో స్ట్రాంగ్ గా ఆడి ఫైనల్ వరకు వెళ్లారు. అదే బాటలో నరేష్ కూడా కామెడీతో పాటు టాస్కుల్లో యాక్టివ్ గా ఉంటే టాప్ -5 లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రామ్ ప్రసాద్ తో కలిసి హౌస్ లో జబర్దస్త్ కామెడీ పండిస్తాడని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్-10 లో జబర్దస్త్ నరేష్ ఎంట్రీతో ఎంటర్ టైన్మెంట్ డబుల్ కానుంది. దశావతారం థీమ్ తో వస్తున్న ఈ సీజన్ లో 16 మంది కంటెస్టెంట్స్ మధ్య నరేష్ ఎలా సర్వైవ్ అవుతాడనేది అందరిలో ఉన్న ప్రశ్న. జబర్దస్త్ ఆడియన్స్ మొత్తం నరేష్ కి సపోర్ట్ గా నిలుస్తారని టాక్. మరి అతను హౌస్ లో కామెడీతోనే ఉంటాడా లేక సీరియస్ గేమ్ కూడా ఆడతాడా అనేది చూడాలి మరి.
[Jabardasth Naresh Bigg Boss Telugu 10, Naresh Bigg Boss Entry, Jabardasth Comedian Bigg Boss House]




